గళమెత్తిన వీఆర్‌ఏలు
ABN, First Publish Date - 2023-07-21T00:02:18+05:30
తమ సమస్యలపై గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) గళమెత్తారు.
నినాదాలు చేస్తున్న వీఆర్‌ఏలు
తమ సమస్యలపై గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏలు) గళమెత్తారు. జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద గురువారం నిరసనలు, రిలే దీక్షలు చేప ట్టారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, పేస్కేలు అమలు చేయాలని, డీఏలతో కూడిన వేతనాలు ఇవ్వాలని, డీఏల రికవరీ జీవోను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. నామినీలను వీఆర్‌ఏలుగా గుర్తించాలన్నారు. భూసర్వేలో పాల్గొన్న వీఆర్‌ఏలకు టీఏ, డీఏలు ప్రభుత్వ మే చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.
-ఆంధ్రజ్యోతి బృందం
Updated Date - 2023-07-21T00:02:18+05:30 IST