తరగతి గదిలోకి వాన నీరు
ABN, First Publish Date - 2023-07-19T00:30:06+05:30
పురపాలక సంఘం పరిధిలోని కొండంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాన వస్తే అవస్థే. ఆవరణంతో పాటు తరగతి గదులూ జలమయం కావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుతున్నారు.
పాటశాల ఆవరణంతా జలమయం
రాజాం/ విజయనగరం(ఆంధ్రజ్యోతి), జూలై 18: పురపాలక సంఘం పరిధిలోని కొండంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాన వస్తే అవస్థే. ఆవరణంతో పాటు తరగతి గదులూ జలమయం కావడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాటశాల భవనం సుమారు 40 ఏళ్ల కిందట నిర్మించింది కావడంతో శిథిలావస్థకు చేరింది. ఒక గది మాత్రమే కాస్త బాగుండడంతో అన్ని తరగతుల వారిని మంగళవారం ఒక గదిలో కూర్చోబెట్టి ముగ్గురు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పారు. పాఠశాల ఆవరణంతా నీరు నిల్వ ఉండిపోవడంతో వరద నీటిలో నుంచే విద్యార్థులు రాకపోకలు సాగించారు. విద్యాశాఖ అధికారులు మాత్రం బాగున్న పాఠశాలలకు నాడు-నేడు నిధులు మంజూరు చేశారు. ఈ స్కూల్‌ను వదిలేశారు. ఈ విషయాన్ని ఎంఈవో పి.ప్రవీణ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా కొండంపేట పాటశాలకు నాడు నేడు నిధులు మూడోవిడతలో మంజూరు చేయడానికి ప్రతిపాదనలు పంపించామని, నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతామని చెప్పారు.
- గజపతినగరం మండలం గంగచోళ్లపెంట పాఠశాల ఆవరణం తాజా వర్షాలకు అధ్వానంగా తయారైంది. విద్యార్థులంతా బురదమయమైన గ్రౌండులో నుంచే పాఠశాలకు వెళ్లి వచ్చారు. కొందరు సైకిళ్లతో వెళ్తూ జారిపడి ఇబ్బంది పడ్డారు. పాఠశాల చెంత నీరు కూడా అధికంగా నిలిచిపోయింది.
Updated Date - 2023-07-19T00:30:06+05:30 IST