ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు రుణాలు అందించండి

ABN, First Publish Date - 2023-01-26T00:34:59+05:30

జిల్లాలో రైతులకు బ్యాంకు అధికారులు త్వరితగతిన రుణాలు అందించి సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సూచించారు.

మాట్లాడుతున్న జేసీ ఆనంద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులకు బ్యాంకు అధికారులు త్వరితగతిన రుణాలు అందించి సహకరించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ(డీఎల్‌టీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న ఖరీఫ్‌, రబీ సీజన్‌లో వరి, ఇతర పంటల రుణ పరిమితి తదితర అంశాలపై సమీక్షించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాల పంటల దిగుబడి, చిన్నతరహా పరిశ్రమల ఆదాయం అంచనా ఆధారంగా రుణ పరిమితి నిర్ధారించినట్లు జేసీ తెలిపారు. నిర్దేశించిన లక్ష్యాల పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో నాబార్డు డీడీఎం నాగార్జున, ఎల్డీఎం మూర్తి, జిల్లా పశుసంవర్థక, మత్స్య శాఖాధికారులు ఈశ్వరరావు, వి.తిరుపతయ్య, బ్యాంకు మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:35:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising