పోరాటానికి సిద్ధం: పీఆర్‌టీయూ
ABN, First Publish Date - 2023-09-22T23:45:35+05:30
జీపీఎస్‌కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పీఆర్‌టీయూ జనరల్ సెక్రటరీ కాగాన విజయ్ శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
పార్వతీపురం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): జీపీఎస్‌కు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని పీఆర్‌టీయూ జనరల్ సెక్రటరీ కాగాన విజయ్ శుక్రవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ‘జీపీఎస్ వద్దు.. పాత పింఛన్ విధానం ముద్దు’ అని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గొంతు చించుకుంటున్నా.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, బలవంతంగా జీపీఎస్‌ను అమలు చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులపై వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే సర్కారు స్పందించి ఓపీఎస్ అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-09-22T23:45:35+05:30 IST