20 నుంచి రాగులు కొనుగోలుకు సన్నద్ధం
ABN, First Publish Date - 2023-10-18T00:05:30+05:30
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ఈనెల 20 నుంచి రాగులును కొనుగోలు చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎండీ నాయక్ తెలిపారు.
పార్వతీపురం టౌన్, అక్టోబరు 17 : జిల్లాలోని కొనుగోలు కేంద్రాల ద్వారా ఈనెల 20 నుంచి రాగులును కొనుగోలు చేయనున్నట్లు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎండీ నాయక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మాట్లాడుతూ.. రాగులు క్వింటా ధర రూ.3,846గా నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు తమ దగ్గరలోని కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించి మద్దతు ధరను పొందాలన్నారు. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 2023-24 సీజన్‌కు సంబంధించి జిల్లాలో 936 మెట్రిక్ టన్నుల మేర దిగుమతి వస్తుందన్నారు. రాగులు కొనుగోలు విషయంలో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.
Updated Date - 2023-10-18T00:05:30+05:30 IST