ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పూర్ణపాడు-లాబేసు వంతెన పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2023-08-18T00:39:11+05:30

: నాగావళి నదిపై పూర్ణపాడు - లాబేసు వంతెన పనులు తక్షణమే చేపట్టి పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తూ పోరాట సాధన కమిటీ నాయకులు డిమాండ్‌చేశారు. ఈ మేరకు గురువారం నుంచి వంతెన నిర్మాణ ప్రాంతం వద్ద పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలను చేపట్టారు. దీక్షలను సీపీఎం రాష్ట్ర నాయకులు ఎం.కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు తమ హక్కులకోసం పోరాటాలు చేయాలన్నారు. పాలకులు నిర్లక్ష్యం వల్ల అర్ధాంతరంగా నిలిచిన వంతెన నిర్మాణానికి పోరాటమే సరైన మార్గమన్నారు. 22 గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకలకు సౌకర్యం కల్పించే వంతెన నిర్మాణంపై పాలకులు నిర్లక్ష్య ధోరణి విడనాడాలన్నారు.

పోరాట సాధన కమిటీ సభ్యులకు సంఘీభావం తెలుపుతున్న టీడీపీ నాయకులు :

కొమరాడ: నాగావళి నదిపై పూర్ణపాడు - లాబేసు వంతెన పనులు తక్షణమే చేపట్టి పూర్తిచేయాలని డిమాండ్‌ చేస్తూ పోరాట సాధన కమిటీ నాయకులు డిమాండ్‌చేశారు. ఈ మేరకు గురువారం నుంచి వంతెన నిర్మాణ ప్రాంతం వద్ద పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలను చేపట్టారు. దీక్షలను సీపీఎం రాష్ట్ర నాయకులు ఎం.కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు తమ హక్కులకోసం పోరాటాలు చేయాలన్నారు. పాలకులు నిర్లక్ష్యం వల్ల అర్ధాంతరంగా నిలిచిన వంతెన నిర్మాణానికి పోరాటమే సరైన మార్గమన్నారు. 22 గిరిజన గ్రామాల ప్రజలకు రాకపోకలకు సౌకర్యం కల్పించే వంతెన నిర్మాణంపై పాలకులు నిర్లక్ష్య ధోరణి విడనాడాలన్నారు.

టీడీపీ నాయకులు సంఘీభావం

వంతెన పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరసన దీక్షలకు టీడీపీ మండల కన్వీనర్‌ శేఖరపాత్రుడు ఆధ్వర్యంలో సంఘీభావం తెలి పారు. తమ ప్రభుత్వం 70 శాతం పనులు పూర్తి చేసినా వైసీపీ ప్రభుత్వం హయాంలో స్థానికంగా ఉన్న మాజీ మంత్రి నిర్మాణం పూర్తి చేయలేకపో యారని టీడీపీ నాయకులు శేఖరపాత్రుడు, మధుసూదనరావు విమర్శించారు.వంతెన పనులకు నిధులు మంజూరుచేసి పనులు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు డి.వెంకటనా యు డు, జి.సుదర్శనరావు,పి.వెంకటినాయుడు,కృష్ణం నాయు డు, తమ్మయ్య, ఎం.సింహాచలం, సత్యనారాయణ, జి.వెంకటి నాయుడు, హరిప్రసాద్‌, శ్రీను, సీపీఎం నాయకులు కె.సాంబమూర్తి, ఈశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-18T00:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising