39 వేల ఎకరాలకే సాగునీరు
ABN, First Publish Date - 2023-07-21T00:07:04+05:30
ఆధునికీకరణ పనుల్లో జాప్యం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్‌కు 39 వేల ఎకరాలకే సాగునీటిని సరఫరా చేస్తామని నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పొన్నాడ సుధాకర్‌రావు తెలిపారు. ఖరీఫ్-2023 సీజన్‌కు గాను గురువారం తోటపల్లి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ, కుడి కాలువల నుంచి సాగునీటిని విడుదల చేశారు.
గరుగుబిల్లి, జూలై 20: ఆధునికీకరణ పనుల్లో జాప్యం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్‌కు 39 వేల ఎకరాలకే సాగునీటిని సరఫరా చేస్తామని నీటిపారుదలశాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పొన్నాడ సుధాకర్‌రావు తెలిపారు. ఖరీఫ్-2023 సీజన్‌కు గాను గురువారం తోటపల్లి ప్రాజెక్టు పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ, కుడి కాలువల నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎడమ కాలువ ద్వారా గరుగుబిల్లి, జియ్యమ్మవలస, వీరఘట్టం, పాలకొండ మండలాల్లోని 81 గ్రామాల పరిధిలోని 31,310 ఎకరాలకు, కుడి కాలువ ద్వారా గరుగుబిల్లి, బలిజిపేట, వంగర మండలాల్లోని 28 గ్రామాల పరిధిలోని 9,128 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే ఓపెన్ హెడ్ చానల్ నుంచి కూడా సాగునీటి సరఫరాపై దృష్టి సారించినట్లు చెప్పారు. తోటపల్లి కాలువల ద్వారా 63,549 ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా ఆధునికీకరణ పనుల్లో జాప్యం కారణంగా ఈ ఖరీఫ్‌కు 39 వేల ఎకరాలకే సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ఎడమ ప్రధాన కాలువ నుంచి 80 క్యూసెక్కులు, కుడి కాలువ నుంచి 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. వరి ఉభాలు ప్రారంభమైన సమయంలో నీటి సరఫరాను పెంచుతామన్నారు. శివారు ప్రాంతాలకు కూడా నీరు అందేలా చూస్తామన్నారు. రైతులు సాగునీటిని వృథా చేయకుండా పంటలకు ఉపయోగించుకోవాలన్నారు. కాలువల ప్రాంతాల్లో మోటారు ఇంజిన్లు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవన్నారు. పలు ప్రాంతాల్లో ఇంజిన్లు ఏర్పాటు చేసే సమయంలో గుంతలు చేయడంతో గండ్లు ఏర్పాడుతున్నాయన్నారు. రెండు కాలువల పరిధిలో ఆధునికీకరణ పనులను అక్టోబరులో పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, ఎంపీపీ ఉరిటి రామారావు, డీఈఈ డి.రవికుమార్, ఏఈలు బి.శంకరరావు, కె.రాజేష్, డీవీ రమణ, వర్క్ ఇన్‌స్పెక్టర్ వి.గౌరునాయుడు, ఐజీలు పకీరు, కుమార్, భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుకు వరద ప్రవాహం
గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. గురువారం నాటికి ఎగువ ప్రాంతం నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. దీంతో అధికారులు రెండు గేట్లను పైకెత్తి నది దిగువ ప్రాంతానికి 2,777 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 105 మీటర్లు కాగా, ప్రస్తుతం 104.13 మీటర్లకు చేరింది. అలాగే ఖరీఫ్‌కు సంబంధించి కుడి ప్రధాన కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, పాత కుడి పిల్ల కాలువ నుంచి 30 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ నుంచి 80 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ప్రాజెక్టు జేఈలు కిషోర్‌కుమార్, శ్రీనివాసరావు తెలిపారు. పైనుంచి అధికంగా వరద ప్రవాహం వస్తే స్పిల్‌వే గేట్లు నుంచి నదిలోకి మళ్లించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.
Updated Date - 2023-07-21T00:07:04+05:30 IST