ఆన్‌లైన్ రుణ యాప్‌లు రద్దు చేయాలి
ABN, First Publish Date - 2023-07-21T00:13:03+05:30
యువతను నాశనం చేస్తున్న ఆన్‌లైన్ రుణ యాప్‌లను వెంటనే రద్ద్దు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
కలెక్టరేట్: యువతను నాశనం చేస్తున్న ఆన్‌లైన్ రుణ యాప్‌లను వెంటనే రద్ద్దు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు వాసు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో రుణ యాప్ పెట్టడం వల్ల చాలా మంది యువత మోసా లకు గురవుతున్నారని ఆరోపించారు. రుణాలు ఇస్తామని చెప్పి తిరిగి తీసుకున్న తరువాత నానా చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, సీఎం జగన్ వెంటనే స్పందించి రుణ యాప్‌లను రద్దు చేయాలని లేని పక్షంలో మరింత పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ నాయకులు ఉన్నారు.
Updated Date - 2023-07-21T00:13:03+05:30 IST