ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీ, హత్యాయత్నం కేసులో ఒకరి అరెస్టు

ABN, First Publish Date - 2023-02-21T23:58:35+05:30

చోరీ, హత్యాయత్నం కేసులో మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన ఓకాడ భగవాన్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ ఎల్‌.అప్పలనాయుడు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గజపతినగరం: చోరీ, హత్యాయత్నం కేసులో మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన ఓకాడ భగవాన్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ ఎల్‌.అప్పలనాయుడు తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ కార్యా లయంలో ఆయన ఈ కేసుకు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడకు చెందిన తిరుమలరాజు జగన్నాథ రాజు గతంలో ఆర్టీసీ శాఖలో రీజనల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించేవారు. ఈయన మెంటాడ మండలంలోని ఉద్దంగా గ్రామ రెవెన్యూ పరిధిలో 25 ఎకరాల తోటను సాగు చేస్తున్నారు. రెండు నెలల కొకసారి వస్తూ కూలీలకు వేతనాలు అందజేస్తుండేవారు. ఈక్రమంలో ఈనెల 15వ తేదీన ఆయన ఉద్దంగా వచ్చారు. తోటలో పనులు ముగించుకొని మధ్యాహ్న భోజన సమయంలో తోటలోగల గెస్టుహౌస్‌లోకి వెళ్తుండగా, అప్పటికే కాపుకాసిన నిందితుడు ఆయన తలపై కర్రతో కొట్టి రూ.10వేలు, రెండు సెల్‌ఫోన్లు, ఒక కీప్యాడ్‌ అపహరించుకుపోయాడు. తోటలో పని చేస్తున్న కళావతి తోటి కూలీల సహాయంతో జగన్నాథరాజును గజప తినగరం ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా నిందితుడు రెండు పర్యాయా లు చోరీకి పాల్పడితే మందలించి వదిలేశారు. గతంలో పోరాంలోని ఎరువుల దుకా ణంలో చోరీకి పాల్పడినట్లు కేసు నమోదయ్యింది. బాధితుడు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. సమావేశంలో ఆండ్ర ఎస్‌ఐ సిద్దార్థకుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-21T23:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising