ఆటో ఢీకొని వృద్ధుడి మృతి
ABN, First Publish Date - 2023-05-27T23:42:59+05:30
మండలంలోని కొండవెలగాడ - విజయనగరం రోడ్డులో శుక్రవారం రాత్రి ఆటో బైకును ఢీకొట్టిన ఘటనలో బెల్లాన రామునాయుడు(59) అనే వృద్ధుడు మృతిచెందాడు.
నెల్లిమర్ల: మండలంలోని కొండవెలగాడ - విజయనగరం రోడ్డులో శుక్రవారం రాత్రి ఆటో బైకును ఢీకొట్టిన ఘటనలో బెల్లాన రామునాయుడు(59) అనే వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటనపై నెల్లిమర్ల ఎస్‌ఐ పి.నారాయణరావు తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. విజయనగరం నుంచి కొండవెలగాడ వైపునకు వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనానికి వెనుక కూర్చున్న రామునాయుడు తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. మృతుడు రామునాయుడు మండలంలోని చినబూరాడపేట గ్రామస్థుడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-05-27T23:42:59+05:30 IST