ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

25న అంగన్‌వాడీల మహాధర్నా

ABN, First Publish Date - 2023-09-20T02:59:57+05:30

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని,

విజయవాడ(ధర్నాచౌక్‌), సెప్టెంబరు 19: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అంగన్‌వాడీ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. విజయవాడలో మంగళవారం ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సీఐటీయూ), ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఏఐటీయూసీ), ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(ఐఎ్‌ఫటీయూ) ప్రతినిధులు కె.సుబ్బరావమ్మ, జే.లలిత, వీఆర్‌.జ్యోతి మాట్లాడారు. తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని మూడు అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్ల ఆధ్వర్యంలో 25న విజయవాడలో మహాధర్నా చేపడుతున్నట్టు వెల్లడించారు. 21 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అంగన్‌వాడీ వర్కర్స్‌, మినీ వర్కర్స్‌, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-09-20T02:59:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising