ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటుతో జగన్‌రెడ్డికి కనువిప్పు కలిగిద్దాం

ABN, First Publish Date - 2023-03-05T00:02:43+05:30

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా పట్టభ ద్రులంతా జగన్‌రెడ్డి కనువిప్పు కలిగించాలని ఎమ్మెల్సీ దుర్వారపు రామారావు, ఎస్‌.కోట నియోజకవర్గ ఎమ్మెల్సీ పరిశీలకులు యనమల కృష్ణుడు పిలుపు నిచ్చారు.

ఎల్‌.కోట: మాట్లాడుతున్న యనమల కృష్ణుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

- టీడీపీ నాయకులు పిలుపు

- చిరంజీవిరావు తరపున విస్తృత ప్రచారం

లక్కవరపుకోట: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా పట్టభ ద్రులంతా జగన్‌రెడ్డి కనువిప్పు కలిగించాలని ఎమ్మెల్సీ దుర్వారపు రామారావు, ఎస్‌.కోట నియోజకవర్గ ఎమ్మెల్సీ పరిశీలకులు యనమల కృష్ణుడు పిలుపు నిచ్చారు. శనివారం మండలంలోని చందులూరు, బీమాలి, కాసాపేట, ఎల్‌.కోట గ్రామాల్లో జరిగిన పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో వారి పాల్గొని ఓటర్లకు ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కల్పించారు. దుర్వారపు రామారావు జిల్లాలో ఎస్‌.కోట నియోజకవర్గం నుంచి ఎక్కువ పట్టభద్రుల ఓట్లు ఉన్నాయని, వీరంతా టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. యనమల కృష్ణు డు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 9వేల ఓట్లు వరకు ఉన్నాయని, సుమా రు 90శాతం ఓట్లు చిరంజీవిరావుకి వేయించాలని, ఇందుకోసం ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఎస్‌.కోట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కోళ్ల లలితకుమారి, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్‌, మాజీ జడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ కొల్లు రమణమూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు చొక్కాకుల మల్లునాయుడు, కొట్టాడ ఈశ్వరరావు, ఎస్‌.కోట మండల పార్టీ అధ్యక్షుడు జీఎస్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా వుండగా రానున్న ఎన్నికల్లో ఎస్‌.కోట నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కోళ్ల లలితకుమారికి టిక్కెట్టు వచ్చేలా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని ఎన్నికల పరిశీలకులు యనమల కృష్ణుడు తెలిపారు. శనివారం మండలంలో జరిగిన నాలుగు క్లస్టర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లలిత కుమారికి అనుభవం, పరిజ్ఞానం, ఆమెకున్న పరిచయాలు కళ్లారా చూశానని, ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు.

- విజయనగరం రూరల్‌: నగరంలోని శనివారం 15వ డివిజన్‌లో టీడీపీ నాయకులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదే విధంగా ఎంవీజీఆర్‌, ఎంఆర్‌ పీజీ కళాశాలల్లో విద్యార్థులను కలిసి టీడీపీ బలపరిచిన వేపాడ చిరంజీవిరావుకి ఓటు వేయాలేని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిక్కాల రామచంద్రరావు, ఎం.పద్మనాభం, టీడీపీ నగర, మండల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- రాజాం: నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వస్టర్స్‌ సమ్మిట్‌కు తెరలేపిందని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆరో పించారు. శనివారం శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కోండ్రు మురళీ మోహన్‌ అఽధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఒక్కపెట్టుబడి కూడా తీసుకురాని జగన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని యువతను మభ్యపెట్టడానికి ఇటు వంటి చర్యలకు పాల్పడుతున్నారని, యువత నమ్మి మోసపోవద్దని పిలుపుని చ్చారు. సమస్యలపై అవగాహన ఉన్న డాక్టర్‌ వేపాడ చిరంజీవిరావును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల టీడీపీ పరిశీలకులు గుత్తుల సాయి, నాయకులు గురవాన నారాయణరావు, జడ్డు విష్ణుమూర్తి, కిమిడి అశోక్‌, పిన్నింటి మోహన్‌రావు, వల్లూరు గణేష్‌, శాసపు రమేష్‌కుమార్‌, నంది సూర్యప్రకాష్‌రావు, వంగా వెంకటరావు, పొట్టా చిట్టిబాబు పాల్గొన్నారు.

- బాడంగి: టీడీపీ బలపరిచిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు విజయానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పత్తిపాడు నియోజ కవర్గ టీడీపీ ఇన్‌చార్జి పరువుల రాజా, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనా యుడు పిలుపునిచ్చారు. శనివారం తెంటు బంగ్లాలో మండలస్థాయి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు తెంటు రవిబాబు, ఎంపీటీసీ పాలవలస గౌరి, వైస్‌ ఎంపీపీ సింగిరెడ్డి భాస్కరరావు, గుణుపూరు స్వామి నాయుడు, బొంతు త్రినాథ్‌, లచ్చుపతుల సత్యం, పామోటి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

- తెర్లాం: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్ముంనాయుడు, పట్టభద్రుల ఎన్నికల పరిశీలకులు వి.రాజు కోరారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహిం చి పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలుపునకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

- గంట్యాడ: వైసీపీ పాలకుల అరాచకాలపై టీడీపీ నాయకులు పోరాటం చేయాలని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు పిలుపునిచ్చారు. శనివారం గింజేరు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరాను గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

- గజపతినగరం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావుకు తమ మద్దతు ప్రకటించాలని పార్టీ మండల అధ్యక్షుడు ఎ.లక్ష్మునా యుడు కోరారు. శనివారం గజపతినగరం, పురిటిపెంట గ్రామాల్లో గల ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలో అధ్యాపకులను కలిసి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవాలని కోరారు. పార్టీ నాయకులు ప్రదీప్‌కుమార్‌, నారాయణప్పలనాయుడు, అరుణ, కోడి సతీష్‌ పాల్గొన్నారు.

- భోగాపురం: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావును గెలిపించాలంటూ శనివారం స్థానిక పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు కోలా రామసూరి, నాయకులు కర్రోతు రాజు, అప్పలరామిరెడ్డి, ఎల్లాజీ పాల్గొన్నారు.

- బొండపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని గజపతినగరం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గొట్లాం గ్రామంలో పట్టభద్రులను కలిసి, చిరంజీవిరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బండారు బాలాజీ, పార్టీ మండల అధ్యక్షుడు కోరాడ కృష్ణ, రాష్ట్ర బీసీ సెల్‌ అధికార ప్రతినిధి తాళ్లపూడి రమణ, పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు, తదితరులు పాల్గొన్నారు.

- జామి: మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ తెలుగుయువత ఆద్యక్షుడు రాయవరపు శంకరరావు ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

- మెరకముడిదాం: గర్బాం గ్రామంలో మాజీ ఎంపీపీ, టీడీపీ మండల అధ్యక్షుడు తాడ్డి సన్యాసినాయుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ఆభ్యర్థి వేపాడ చిరంజీవిరావును గెలిపించాలని కోరారు.

- గరివిడి: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిరంజీవిరావును గెలిపించాలని పార్టీ మండల నాయకులు సారిపాక సురేష్‌కుమార్‌, పైల బలరాం కోరారు. వారు శనివారం చుక్కవలస, బీజే పాలెం, వెదుళ్లవలస, అప్పన్నవలస తదితర గ్రామాల్లో ప్రచారం చేశారు.

- గుర్ల: టీడీపీ మద్దతుతో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవి రావును గెలిపించాలని పార్టీ మండల అధ్యక్షుడు చనమల మహేశ్వరరావు కోరారు. ఆయన శనివారం నాగళ్లవలస గ్రామ సచివాలయానికి వెళ్లి పట్టభద్రులను కలిసి ప్రచారం చేశారు.

- కొత్తవలస: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా ఆలోచించి ఓటు వేయాలని టీడీపీ నాయకులు విన్నవించారు. శనివారం రెల్లి గ్రామంలో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న వేపాడ చిరంజీవరావును గెలిపించాలని ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కరపత్రాలు, ఓటర్ల స్లిప్‌లు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకుడు వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T00:02:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising