ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్థిక స్థితిని బట్టి న్యాయసేవలు మారకూడదు

ABN, First Publish Date - 2023-03-26T00:20:25+05:30

కక్షిదారుల ఆర్థిక స్థితిగతులను బట్టి న్యాయసేవలు మారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశాఖ భూసేకరణ, రిహేబిలిటేషన్‌ ప్రిసైడింగ్‌ అధికారి, ల్యాండు గ్రాబింగ్‌ ట్రిబ్యునల్‌ జడ్జి ఉంగట్ల సత్యారావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బొబ్బిలి, మార్చి 25: కక్షిదారుల ఆర్థిక స్థితిగతులను బట్టి న్యాయసేవలు మారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని విశాఖ భూసేకరణ, రిహేబిలిటేషన్‌ ప్రిసైడింగ్‌ అధికారి, ల్యాండు గ్రాబింగ్‌ ట్రిబ్యునల్‌ జడ్జి ఉంగట్ల సత్యారావు అన్నారు. స్థానిక ఎన్‌జీవో హోంలో శనివారం సీనియర్‌ న్యాయవాది కండాపు ప్రసాదరావు అధ్యక్షతన భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్‌) జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యారావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రాధాన్యాలు వాటంతటవే మారుతుంటాయని, న్యాయవాదులు తమ వాదనా పటిమకు సంబంధించిన నైపు ణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలన్నారు. చదవకుండా తీర్పులు ఇవ్వ డం సాధ్యం కాదని, ఒక వేళ ఇచ్చినా తప్పు అవుతుందన్నారు. అలా వెలువడిన తీర్పుల పర్యవసానంగా దేశంలో అనేక సమస్యలు ఉత్పన్నమైన సందర్భాలను ఆ యన ఊటంకించారు. హిందూ అవిభక్త కుటుంబ, వారసత్వ హక్కులు, ఆస్తుల కు సంబంధించిన కేసుల్లో ఏళ్ల తరబడి వాదోపవాదాలు, అప్పీళ్లు జరుగుతూనే ఉన్నా యన్నారు. అందుకే జడ్జిలు, న్యాయవాదులు నిపుణత సాధించాలని సత్యా రావు హితవు పలికారు. దేశంలోని 550 జిల్లాల్లో విస్తరించిన ఇండియన్‌ అసోసి యేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ (ఐఏఎల్‌) సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సెమినార్లు, నిజ నిర్ధారణ కమిటీలు, న్యాయశాఖ పరీక్షలకు వెళ్లేవారికి శిక్షణ తదితర కార్యకలా పా లు నిర్వ హిస్తున్నట్లు రాష్ట్ర ఐఏఎల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సురేష్‌కుమార్‌ తెలి పారు. ఏపీలో పదివేలమంది సభ్యులు ఉన్నారని, సంఘం కార్యకలాపాలను మరింత ము మ్మరం చేసేందుకు కృషి జరుగుతోందని ఆయన అన్నారు. ఈ సమా వేశంలో వివిధ జిల్లా లకు చెందిన సీనియర్‌ న్యాయవాదులు భాగవతమ్మ, ఫాల్గుణ రావు, సీహెచ్‌ రమ ణరావు, శ్రీనివాసరావు, స్థానిక సంఘం అధ్యక్షుడు చోడిగంజి రా మారావు, తమ్మి రెడ్డి దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-26T00:20:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising