ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాపు నేస్తం లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవాలి

ABN, First Publish Date - 2023-07-22T00:15:29+05:30

వైఎస్సార్‌ కాపునేస్తం పథకం లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.గడ్డెమ్మ అన్నారు.

పార్వతీపురం ఆంధ్రజ్యోతి: వైఎస్సార్‌ కాపునేస్తం పథకం లబ్ధిదారులు ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌.గడ్డెమ్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద అర్హులైన 45-60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఓసీ కాపు, తెలగ, బలిజి, ఒంటి కులాలకు చెందిన మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.15వేల సహాయం అందిస్తారని చెప్పారు. మొదటి సంవత్సరం 2020-21 సంవత్సరానికి పార్వతీపురం మన్యం జిల్లాకు రూ.1362 మంది లబ్ధిదారులకు రూ.2.04కోట్లు, రెండో సంవత్సరం 2021-22కు 1,344 మంది లబ్ధిదారు లకు రూ.2.14 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారని వివరించారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద నాలుగో సంవత్సరం 2023-24 సంవత్సరానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నవారికి ఆగస్టు నెలలో లబ్ధిదారుల ఖాతాలలో ఆర్థిక సహాయం జమ చేస్తారని చెప్పారు. 45-60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఓసీ, కాపు, తెలగ, బలిజ, ఒంటి కులాలకు చెందిన మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన వారందరూ వలంటీర్లను సంప్రదించి సంబంధిత సచివాలయం దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఆధార్‌ ప్రామాణికంగా ఈకేవైసీ చేసుకోవాలని ఆమె కోరారు. గత మూడు సంవత్సరాలు లబ్ధిపొందినవారు తప్పనిసరిగా ఆధార్‌ ప్రామాణికరణ ఈకేవైసీ చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-07-22T00:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising