ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2023-05-02T00:11:40+05:30

స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోగల ఏడు అంగన్‌వాడీ హెల్పర్లు, మూడు మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పాచిపెంట సీడీపీవో బొత్స అనంతలక్ష్మి ఒకప్రకటనలో సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాచిపెంట: స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోగల ఏడు అంగన్‌వాడీ హెల్పర్లు, మూడు మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పాచిపెంట సీడీపీవో బొత్స అనంతలక్ష్మి ఒకప్రకటనలో సోమవారం తెలిపారు. హెల్పర్లకు సంబంధించి ఎస్టీలకు 5, బీసీలకు ఒకటి, ఎస్సీకి ఒకటి, అలాగే కార్యకర్తల కు మూడు ఎస్టీలకు కేటాయించినట్టు చెప్పారు. అంగన్‌వాడీ హెల్పర్లకుగాను మోదుగ, మాతుమూరు, మిలియాకంచూరు, చినచీపురువలస, కుంతాం గ్రామాలను ఎస్టీలకు కేటాయించారని తెలిపారు. విశ్వనాథపురం ఓసీకి, చెరుకుపల్లి ఎస్సీకి కేటాయించారన్నారు. అంగన్‌వాడీ మినీ కార్యకర్తలకుగాను వలిసలమడ, లోవవలస, రావివలసలను ఎస్టీలకు కేటాయించారని ఆమె తెలిపారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు పోస్టల్‌ ద్వారా గానీ, నేరుగా సీడీపీవో కార్యాలయానికి గానీ అందజేయాలన్నారు. అభ్యర్థులు స్థానిక వివాహిత అయి ఉండి 2022 జూలై 1వ తేదీ నాటికి 21 నుంచి 35 సంవత్సరాల వయస్సులోపు కలిగి ఉండాలని సీడీపీవో అనంతలక్ష్మి తెలిపారు.

Updated Date - 2023-05-02T00:11:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising