ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులకు అన్యాయం చేస్తే తీవ్ర పరిణామాలు

ABN, First Publish Date - 2023-03-31T00:08:42+05:30

అభంశుభం తెలియని గిరిజనులకు అన్యాయం చేసేందుకు ప్రయ త్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఉంటుందని అరకు నియోజ కవర్గ టీడీపీ సెల్‌ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గరుగుబిల్లి : అభంశుభం తెలియని గిరిజనులకు అన్యాయం చేసేందుకు ప్రయ త్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఉంటుందని అరకు నియోజ కవర్గ టీడీపీ సెల్‌ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి సత్యనారాయణ హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకే వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని విమర్శించారు. గురువారం చిలకాంలో విలేకరులతో మాట్లాడుతూ బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు శాసనసభలో ఆమోదించడం వెనుక కుట్రలు దాగి ఉన్నాయన్నారు. ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు శాసన సభ బిల్లు ఆమోదించడం చట్ట విరుద్ధమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించినా కేంద్రం తిరస్కరించే పరిస్థితి ఉందన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి తమ పబ్బం గడుపుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలన్నా రు.ఏజెన్సీలో విభజించి పాలించడం అన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చేసిన పన్నాగం ఇది అని విమర్శించారు. ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుండడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. జగన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనలో అరాచాకాలే తప్ప అభివృద్ధి చూడలేదని విమర్శించారు. తిరుపతిలో మత్తు పదార్ధాలు లభ్యమవుతున్నాయంటే పాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని తెలిపారు.

Updated Date - 2023-03-31T00:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising