ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం

ABN, First Publish Date - 2023-04-03T23:54:16+05:30

రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు.

మాట్లాడుతున్న కర్రోతు బంగార్రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డెంకాడ: రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోందని టీడీపీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు అన్నారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు పల్లె భాస్కరరావు ఆధ్వర్యంలో యూత్‌ కన్వీనర్ల శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య పెరగడమే కాకుండా, యువత మత్తుపదార్ధాల కు బానిసలు అవుతున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడినట్లయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చునని చెప్పారు. అనంతరం చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలైన వైసీపీ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల, భోగాపురం మండల పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యం, కడగల ఆనంద్‌కుమార్‌, టీడీపీ పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పాణిరాజు, అకిరి ప్రసాద్‌, గేదెల రాజారావు, క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ ఇన్‌చార్జిలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T23:54:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising