ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శ్రమదానం ‘బాట’లో..

ABN, First Publish Date - 2023-08-20T00:16:33+05:30

తమ గ్రామ రహదారి పనులు పూర్తి చేయాలని ఎగువద్వారబంధం కొండ శిఖర గ్రామానికి చెందిన గిరిజనులు అనేక పర్యాయాలు ఐటీడీఏ స్పందనలో వినతులు ఇచ్చారు. అయినా ఎటువంటి చర్యల్లేవు.

శ్రమదానంతో ఎగువ ద్వారబంధం రహదారి పనులు చేస్తున్న గిరిజనులు

సీతంపేట: తమ గ్రామ రహదారి పనులు పూర్తి చేయాలని ఎగువద్వారబంధం కొండ శిఖర గ్రామానికి చెందిన గిరిజనులు అనేక పర్యాయాలు ఐటీడీఏ స్పందనలో వినతులు ఇచ్చారు. అయినా ఎటువంటి చర్యల్లేవు. దీంతో అత్యవసర వేళల్లో వారికి అవస్థలు తప్పడం లేదు. 108 వాహనంతో పాటు రేషన్‌ బండి (ఎండీయూ) కూడా రావడం లేదు. రేషన్‌ కోసం ప్రతి నెలా రెండు కిలోమీటర్ల దూరంలోని రేగులగూడ గ్రామానికి వెళ్లి వెళ్లాల్సి వస్తోంది. రోగులను ఆసుపత్రులకు చేర్చాలంటే డోలీయే దిక్కవుతోంది. సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రిపాడు పీహెచ్‌సీకి చేరుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఉపాధ్యాయుడు కూడా గ్రామానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాటిన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న గ్రామస్థులు శనివారం శ్రమదానంతో గ్రామ రహదారిని బాగు చేసుకున్నారు. కనీసం ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగించేలా రహదారిపై గోతులు పూడ్చి చదును చేశారు. వాస్తవానికి 2020లో ఎగువ ద్వారబంధం గ్రామ రహదారి నిర్మాణానికి రూ.3.2 కోట్లు మంజూరు చేశారు. పీఎం గ్రామ సడక్‌ యోజన పథకం , ఏపీ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్‌శాఖ ఉమ్మడి నిధులతో 2021 నవంబరులో ఈ పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మర్రిపాడు బీటీ రోడ్డు నుంచి ఎగువ ద్వారబంధం వరకు 5.3 కిలోమీటర్ల రహదారి పనులుచేపట్టాల్సి ఉంది. అయితే మంజూరైన నిధుల మేరకు 3.4 కిలోమీటర్ల రహదారి పనులను ఈ ఏడాది మే నెలలో పూర్తి చేశారు. నిధులు లేమి కారణంగా మిగతా రెండు కిలోమీటర్లు రహదారి పనులను అర్ధాంతరంగా నిలిపేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామానికి చెందిన సవర సుబ్బారావు, వెంకయ్య, నాగేశ్వరరావు, బిడ్డిక కోపన్న తదితరులు కోరుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సనపాల శ్రీరామ్మూర్తిని వివరణ కోరగా.. రెండు కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

Updated Date - 2023-08-20T00:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising