ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వశీకరణ మందు పేరిట.

ABN, First Publish Date - 2023-01-30T00:04:49+05:30

‘ప్రేమించిన అమ్మాయి నీకు దక్కాలంటే ఆమెపై వశీకరణ మందును ప్రయోగించాలి. ఏజెన్సీలో లభించే వశీకరణ మందు కావాలంటే రూ.1.75 లక్షలు ఉండాలి’ అంటూ నమ్మించి ఒక బాలుడితో దొంగతనాలు చేయించిన ముఠాను బొబ్బిలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వశీకరణ మందు పేరిట..

చోరీల ముగ్గులోకి బాలుడు

బొబ్బిలిలో ఇద్దరి అరెస్ట్‌, పరారీలో మరొకరు

బొబ్బిలి, జనవరి 29: ‘ప్రేమించిన అమ్మాయి నీకు దక్కాలంటే ఆమెపై వశీకరణ మందును ప్రయోగించాలి. ఏజెన్సీలో లభించే వశీకరణ మందు కావాలంటే రూ.1.75 లక్షలు ఉండాలి’ అంటూ నమ్మించి ఒక బాలుడితో దొంగతనాలు చేయించిన ముఠాను బొబ్బిలి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత మూడు నెలలుగా బొబ్బిలి పట్టణంలో చోరీలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రెండు చోరీలను ఛేదించారు. వీటికి సంబంధించి నలుగురు నిందితులుగా తేల్చారు. ముగ్గురు పట్టుబడగా.. అందులో ఒక బాలుడు ఉన్నాడు. మరొకరు పరారీలో ఉన్నారు. కుమ్మరి వీధికి చెందిన గెంబలి మురళీ ఇంట్లో డిసెంబరు 2 న చోరీ జరిగింది. బంగారంతో పాటు నగదును పట్టుకుపోయారు. నవంబరు 10 న సిద్దా హరిబాబా ఇంట్లో చోరీ జరిగింది. అక్కడ కూడా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ రెండు కేసుల్లో పల్లివీధికి చెందిన కాసా కిరణ్‌ ప్రధాన నిందితుడు కాగా.. ములమండ్ల మనోహర్‌, సోభట్ల మురళీకృష్ణలతో పాటు మరో బాలుడు సహకరించాడు. కాసా కిరణ్‌ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆకతాయిగా తిరుగుతుండేవాడు. కొంతమంది యువకులను నేర కార్యకలాపాల కోసం పురమాయిస్తుండేవాడు. ఈ క్రమంలో మనోహర్‌, మురళీకృష్ణలతో పాటు బాలుడ్ని చోరీలకు ప్రోత్సహించాడు. ప్రేమించిన అమ్మాయి నీకు దక్కాలంటే వశీకరణ ప్రయోగం అవసరమని.. ఏజెన్సీలో అమ్ముతున్నారని నమ్మించి.. ఆ సొమ్ము కోసం బాలుడ్ని చోరీల ముగ్గులోకి దించాడు. కిరణ్‌ బయట ఉంటూ వాట్సాప్‌, వీడియోకాల్‌లో చోరీలు ఎలా పాల్పడాలో వారికి వివరించేవాడు. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కిరణ్‌తో పాటు మనోహర్‌, బాలుడు పట్టుబడ్డారు. మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు. బాలుడికి కౌన్సెలింగ్‌ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. విలేఖర్ల సమావేశంలో ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌, ఏఎస్‌ఐ బీవీ రమణ, హెచ్‌సీలు శ్రీనివాస్‌, మురళీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-30T00:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising