ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వర్షం కురిస్తే.. వణుకే?

ABN, First Publish Date - 2023-07-19T00:39:37+05:30

‘నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశాం.. ప్రైవేట్‌, కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పించాం’ అని వైసీపీ సర్కారు పదేపదే చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ అనేక ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు దూరంగానే ఉన్నాయి. వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది.

గరుగుబిల్లి: సీమలవానివలస పాఠశాలలో వర్షపు నీటిలోనే కూర్చొన్న విద్యార్థులు

పలు ప్రభుత్వ పాఠశాలల్లో మారని పరిస్థితి

వర్షపు నీటిలో విద్యార్థులకు తప్పని అవస్థలు

‘నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశాం.. ప్రైవేట్‌, కార్పొరేట్‌కు దీటుగా సౌకర్యాలు కల్పించాం’ అని వైసీపీ సర్కారు పదేపదే చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ అనేక ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు దూరంగానే ఉన్నాయి. వసతి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. శిథిల భవనాల్లో చదువుకోవాల్సిన దుస్థితి. వర్షాకాలంలో అయితే విద్యార్థుల బాధలు రెట్టింపవుతున్నాయి. వర్షపునీటిలోనే వణుకుతూ.. అవస్థలు పడాల్సి వస్తోంది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండగా మంగళవారం జిల్లాలోని పలు పాఠశాలల్లో పరిస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

భవనం కారుతున్నా..

గరుగుబిల్లి : గిరిజన గ్రామమైన సీమలవానివలసలో 40 ఏళ్ల కిందట నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కాగా ప్రస్తుతం ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మంగళవారం పాఠశాలలోని తరగతి గదిలో వర్షపు నీరు చేరింది. పైకప్పు పూర్తిగా శిఽథిలం కావడంతో నీరు లీకవుతోంది. దీంతో అవస్థల నడుమే విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించారు. ఏటా వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొనగా.. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిశీలనకే పరిమితమయ్యారు తప్ప నూతన భవవ నిర్మాణానికి చొరవ చూపలేదని గ్రామస్థులు తెలిపారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న కారణంగా నాడు-నేడుకు ఈ పాఠశాలను ఎంపిక చేయలేదని , నిబంధనలు సడలించి నూతన భవనానికి మోక్షం కల్పించాలని వారు కోరుతున్నారు. ఇదిలాఉండగా గతేడాది భారీ వర్షాలకు సీమవానివలస పాఠశాల మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. దీంతో గ్రామంలోని రచ్చబండపై విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఈ ఏడాది కూడా వర్షాలు జోరుగా కురిస్తే.. గతేడాది పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భవనం ఏ నిమిషంలో కూలుతుందోనన్న భయాందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు.

సర్దుకుని కూర్చోవాల్సిందే..

భామిని: బురుజోల ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇక్కడ చదువుతున్న 68 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం కురిసిన వర్షానికి పాఠశాలలోని రెండు గదుల్లోకి నీరు చేరింది. భవనం పైనున్న రేకుల నుంచి కూడా వర్షపునీరు కారడంతో విద్యార్థులు ఖాళీ స్థలంలో సర్దుబాటు చేసుకుని కూర్చున్నారు. చివరకు గదుల్లో చేరిన నీటిని ఒత్తించి.. విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు బోధించారు. నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. నాడు-నేడు కింద రూ.42 లక్షలు మంజూరయ్యాయని రెండేళ్లుగా అధికారులు చెప్పడమే తప్ప ఎటువంటి పనులు చేపట్టడం లేదని గ్రామస్థులు తెలిపారు. బీటలు వారిన గోడలతో భవనం ఎప్పుడు కూలుతుందో తెలియదని, విద్యార్థులను పాఠశాలకు పంపించాలంటేనే భయమేస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

Updated Date - 2023-07-19T00:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising