ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంటింటి చెత్త రోడ్డుపైకి!

ABN, First Publish Date - 2023-08-21T00:10:45+05:30

రాజాం మండలం పెనుబాకలో రహదారిపైనే చెత్త పారబోస్తున్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)లో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నా తడి, పొడిచెతను వేరుచేసి సంపద కేంద్రాలకు తరలించడం లేదు. మరో గ్రామం కంచరాంలో పాఠశాలకు కూతవేటు దూరంలో రహదారిపై చెత్త పారబోస్తున్నారు. ఇక్కడ కూడా ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నారు. అయితే సంపద కేంద్రాలకు తరలించకుండా రోడ్డుపై పారబోస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో ఆ చెత్త కాస్త కుళ్లి దుర్వాసన వస్తోంది. ఈ దుస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది.

కంచరాం గ్రామంలో రోడ్డుకు ఆనుకొని వేసిన చెత్త

ఇంటింటి చెత్త రోడ్డుపైకి!

సంపద కేంద్రాలకు తరలించని వైనం

జిల్లాలో ‘క్లాప్‌’ విఫలం

క్లాప్‌ మిత్రలకు జీతాల్లోనూ జాప్యం

సడలిన స్వచ్ఛ సంకల్పం

రాజాం మండలం పెనుబాకలో రహదారిపైనే చెత్త పారబోస్తున్నారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)లో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నా తడి, పొడిచెతను వేరుచేసి సంపద కేంద్రాలకు తరలించడం లేదు. మరో గ్రామం కంచరాంలో పాఠశాలకు కూతవేటు దూరంలో రహదారిపై చెత్త పారబోస్తున్నారు. ఇక్కడ కూడా ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నారు. అయితే సంపద కేంద్రాలకు తరలించకుండా రోడ్డుపై పారబోస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో ఆ చెత్త కాస్త కుళ్లి దుర్వాసన వస్తోంది. ఈ దుస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది.

(రాజాం)

పేరుకే ఇంటింటా చెత్త సేకరణ.. గ్రామాల్లో ఈ ప్రక్రియ జరుగుతున్నా మొక్కుబడి చందమైంది. సేకరించే చెత్త రోడ్డుపైకి చేరుతోంది. స్వచ్ఛ సంకల్పం పూర్తిగా సడలింది. టీడీపీ హయాంలో స్వచ్ఛాంధ్రమిషన్‌ కింద చెత్త సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)గా పేరు మార్చారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరిట ఇంటింటా చెత్త సేకరణ చేపడుతున్నారు. అయితే ఈ పథకం ద్వారా ఇళ్ల పరిసరాలు శుభ్రం అవుతున్నాయి తప్ప రహదారులు కాదు. రోడ్లు చెత్త స్థావరాలైపోతున్నాయి. అటుగా నడిచేవారు.. వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చెత్త నుంచి సంపద కేంద్రాలకు రహదారి సౌకర్యం లేదని.. ఇతరత్రా కారణాలు చూపి ప్రజలు రాకపోకలు సాగించే రహదారులపై చెత్త పడేస్తున్నారు. పాఠశాలలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, నివాసాల సమీపంలో సైతం చెత్త వేయడంతో అందరూ అసౌకర్యానికి గురవుతున్నారు. విపరీతమైన దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి

జిల్లాలోని 777 పంచాయతీలు... నెల్లిమర్ల నగర పంచాయతీ... రాజాం, బొబ్బిలి మునిసిపాల్టీలు, విజయనగరం నగరపాలక సంస్థలో కూడా క్లాప్‌ పథకం అమలు జరుగుతోంది. మున్సిపాల్టీలు, నగర పంచాయతీ, మేజర్‌ పంచాయతీల్లో చెత్త సేకరణకు వాహనాలు సమకూర్చారు. పంచాయతీల్లో మాత్రం టై సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకూ గ్రామాల్లో ప్రతి ఇంటా చెత్త సేకరించాలి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సంపద కేంద్రాలకు తరలించాలి. 143 రకాల ప్లాస్టిక్‌ సామగ్రిని వేర్వేరు చేయాలి. వాటిని రీ సైకిల్‌ చెయ్యాలి. అయితే ఒక్క చెత్త సేకరణతో చేతులు దులుపుకుంటున్నారు. గ్రామాల్లో ఉండే చెత్తను రోడ్లపైకి తెచ్చి పారబోస్తున్నారు. మరోవైపు జిల్లాలో 775 చెత్తసంపద కేంద్రాలు మంజూరు కాగా ఇంతవరకు 553 భవనాల నిర్మాణం పూర్తిచేశారు. మిగిలిన వాటిలో కొన్నింట స్థల సమస్య ఉంది. మరికొన్ని అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

జీతాలు ఇవ్వకుంటే ఎలా?

జిల్లా వ్యాప్తంగా 2,337 మంది క్లాప్‌మిత్రలను నియమించారు. ఇందులో 1,861 మంది ఇంటింటా చెత్త సేకరణ చేపట్టాలి. మిగిలిన 476 మంది చెత్త సంపద కేంద్రాల వద్ద పనిచేయాలి. వీరికి నెలకు రూ.6 వేల వేతనంగా నిర్ణయించారు. మున్సిపాల్టీల్లో మాత్రం చెత్త వాహన డ్రైవర్లకు రూ.18 వేలు వేతనం ఇస్తామని ప్రకటించారు. అయితే విధుల్లో చేరిన తరువాత రూ.12 వేలే అందిస్తున్నారు. క్లాప్‌ మిత్రలు, డ్రైవర్లకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ ఆరు నెలల జీతాలు ఒకేసారి ఇచ్చారు. అది కూడా పంచాయతీ నిధుల నుంచి సర్దుబాటు చేశారు. ఆ తర్వాత జీతాలు చెల్లించడం లేదు. దీంతో ఆ ప్రభావం పనులపై పడుతోంది. పనులు చేసేందుకు క్లాప్‌ మిత్రలు ముందుకు రావడం లేదు. తొలుత ప్రభుత్వమే నేరుగా ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. తరువాత పంచాయతీలకు అప్పగించింది. అసలే నిధులు లేక ఇబ్బందులు పడుతున్న పంచాయతీలు చేతులెత్తేశాయి. దీంతో కొన్నిచోట్ల వాహనాలు మూలకు వెల్లాయి. క్లాప్‌ మిత్రలు సైతం మానేస్తున్నారు.

కుక్కలు, పందుల స్వైరవిహారం

రోడ్డుపక్కనే చెత్త పారబోస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు కుక్కలు, పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ చెత్తలో వ్యర్థాలు తినేందుకు ఎగబడుతున్నాయి. రహదా రుల పక్కనే గుంపులు గుంపులుగా సంచరిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల అటువైపుగా వెళుతున్న వారిని వెంబడిస్తున్నాయి. విద్యార్థులు, మహిళలు కుక్కకాటుకు గురవుతున్నారు. చెత్తను సంపద కేంద్రాలకు, డంపింగ్‌ యార్డులకు తరలించే ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం

గ్రామాల్లో సేకరిస్తున్న చెత్తను రహదారులపై పారబోస్తున్నారు. డంపింగ్‌ యార్డుకు కానీ.. చెత్త సంపద కేంద్రానికి కానీ తీసుకెళ్లడం లేదు. దీంతో అసౌకర్యానికి గురవుతున్నాం. వర్షాలు పడుతుండడంతో దుర్వాసన వస్తోంది. సమీప నివాసితులు ఇబ్బందులు పడుతున్నారు.

చీడి కుమార్‌, గ్రామస్థుడు, పెనుబాక

లాభం లేకపోతోంది

గ్రామంలో చెత్త సేకరిస్తున్నారు కానీ ప్రయోజనం లేకపోతోంది. ఆ చెత్తను రోడ్డు పక్కనే విడిచిపెడుతున్నారు. కుక్కలు, పందులు వ్యర్థాలను తీసుకొని రోడ్డుపైకి తెస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుర్వాసనతో పాటు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

- గంటా పద్మావతి, గ్రామస్థురాలు, మగ్గూరు

సంపద కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెడుతున్నాం

చెత్తసంపద కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెడుతున్నాం. అన్నికేంద్రాలను వినియోగంలోకి తేవాలన్నదే లక్ష్యం. జిల్లాలో 775 కేంద్రాలు మంజూరు కాగా ఇంతవరకు 553 కేంద్రాలను పూర్తిచేశాం. వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి చెత్తను సంపద కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శిలకు కచ్చితమైన ఆదేశాలు కూడా జారీచేశాం.

- శ్రీధర్‌ రాజు, జిల్లా పంచాయతీ అధికారి, విజయనగరం

Updated Date - 2023-08-21T00:10:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising