గోడకు తలను కొట్టి.. చీరకొంగుతో ఉరి
ABN, First Publish Date - 2023-08-02T00:41:25+05:30
శృంగవరపుకోట లాడ్జిలో రెండు రోజుల క్రితం జరిగిన హత్యను పోలీస్‌లు ఛేదించారు. నిందితునితో పాటు మృతురాలి వద్ద నుంచి దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఆర్.గోవిందరావు ఘటన గురించి వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
గోడకు తలను కొట్టి.. చీరకొంగుతో ఉరి
లాడ్జిలో మహిళ హత్యకేసు నిందితుల అరెస్టు
శృంగవరపుకోట, ఆగస్టు 1: శృంగవరపుకోట లాడ్జిలో రెండు రోజుల క్రితం జరిగిన హత్యను పోలీస్‌లు ఛేదించారు. నిందితునితో పాటు మృతురాలి వద్ద నుంచి దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఆర్.గోవిందరావు ఘటన గురించి వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువాలీ మండలం ఉరుములు గ్రామానికి చెందిన మాదల శ్రీరాములు గత నెల 24న దేవరాపల్లి మండల కేంద్రానికి చెందిన 48 ఏళ్ల మహిళను తీసుకుని స్థానికంగా ఉన్న ఓ లాడ్జిలో దిగాడు. అక్కడే ఉంటూ అదే నెల 26న ఇద్దరూ గొడవ పడ్డారు. మాటమాట పెరగడంతో మహిళను గోడవైపు బలంగా నెట్టాడు. అప్పటికే గాయపడిన ఆమెను చీరు కొంగుతో ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం ఆమె చేతికి ఉన్న నాలుగు గాజులు, చెవి దిద్దులు, చేతి ఉంగరం తీసేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జూలై 28 వరకు లాడ్జి గదికి రావడం, పోవడం చేస్తుండేవాడు. నగలను జూలై 27న స్థానిక ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశాడు. జూలై 30న గది నుంచి దుర్వాసన రావడంతో లాడ్జి మేనేజర్ గనివాడ శ్రీనివాసరావు పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీస్‌లు ఆగస్టు 1న మధ్యాహ్నం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో శ్రీరాములు నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో కొత్తవలస సీఐ చంద్రశేఖర్‌రావు, ఎస్.కోట సీఐ బాల సూర్యారావు, ఎస్.ఐ తారకేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2023-08-02T00:41:25+05:30 IST