ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేనిఫెస్టోతో వైసీపీలో గుబులు

ABN, First Publish Date - 2023-06-03T00:04:29+05:30

రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీలో గుబులు పుట్టడంతో పాటు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.

వేపాడ: మాట్లాడుతున్న అప్పల రాంప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీలో గుబులు పుట్టడంతో పాటు ఓటమి భయం పట్టుకుందని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం టీడీపీ నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.

అరాచక పాలనకు చరమగీతం పాడాలి

మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

శృంగవరపుకోట రూరల్‌: మండ లంలోని రేవళ్లపాలెం, కొట్టాంల్లో మహానాడు విజయవంతం చేసిన నాయకులు, కార్యక ర్తలకు ధన్యవాదాలు శుక్రవారం తెలిపారు. అనంతరం కొట్టాం కోటమ్మను దర్శించుకొని అరాచకపాలనకు చరమగీతం పాడాలని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరారు. కార్యక్రమంలో జీఎస్‌ నాయుడు,రెడ్డి వెంకన్న పాల్గొన్నారు.

విజయమే ధ్యేయంగా పని చేయాలి

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాంప్రసాద్‌

వేపాడ : విజయమే ధ్యేయంగా పనిచేయాలని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్‌ పిలుపునిచ్చారు.శుక్రవారం మండలంలోని చినగుడిపాల, నీల కంఠరాజ పురంల్లో పార్టీ శ్రేణులతో ఎంపీటీసీ మాజీ సభ్యుడు వేచలపు జగ్గుబాబు స్వగృహంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రాంప్రసాద్‌ మాట్లాడుతూ నాలుగేళ్లు వైసీపీ పాలనలో అరాచకాలు, దోపిడీలు,పెరిగిపోయాయన్నారు. మహానా డులో ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల మనసును దోచుకుంటోందన్నారు. కార్యక్రమంలో పార్టీమండల ఉపాధ్యక్షుడు పోతల వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, రాష్ట్ర ఎస్టీ విభా గం ఉపాధ్యక్షురాలు, మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి, టీడీపీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి కోళ్ల వెంకటరమణ, నాయకులు రాము, అమ్మతల్లినాయుడు, బంగారునాయుడు, మద్దాలు, అవతారం, కోన సత్యం, అక్కిరెడ్డి రమణ, గుంటపల్లిదే ముడునాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:04:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising