‘తోటపల్లి’కి వరద
ABN, First Publish Date - 2023-09-22T00:02:11+05:30
తోటపల్లి సాగునీటి ప్రాజెక్టులోకి గురువారం భారీగా వరద వచ్చి చేరింది. గత కొన్ని రోజులుగా ఒడిశాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పైప్రాంతం నుంచి 13,250 క్యూసెక్కుల నీరు తోటపల్లికి చేరింది.
గరుగుబిల్లి: తోటపల్లి సాగునీటి ప్రాజెక్టులోకి గురువారం భారీగా వరద వచ్చి చేరింది. గత కొన్ని రోజులుగా ఒడిశాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా పైప్రాంతం నుంచి 13,250 క్యూసెక్కుల నీరు తోటపల్లికి చేరింది. అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్ల నుంచి నాగావళి నదిలోకి 13,261 క్యూసెక్కులను విడుదల చేశారు. ప్రాజెక్టులో 105 మీటర్ల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 104.50 మీటర్లు నిల్వ ఉన్నట్లు జేఈలు శ్రీనివాసరావు, ఆపరేటర్ కెంగువ రామకృష్ణ తెలిపారు. క్రమేపీ వరద తగ్గుముఖం పడుతుందన్నారు. సాగునీటి అవసరాల నిమిత్తం కుడి, ఎడమ ప్రధాన కాలువల నుంచి 1,420 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2023-09-22T00:02:11+05:30 IST