ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లెక్సీ ప్రింటింగ్‌ నిర్వాహకులకు ఊరట

ABN, First Publish Date - 2023-01-26T00:35:22+05:30

ఫ్లెక్సీలు ప్రింటింగ్‌ వేస్తున్న నిర్వాహకులకు హైకోర్టు తీర్పుతో ఊరట కలిగింది. ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో ఫ్లెక్సీల మెటీరియల్‌గా వాడుతున్న ఉత్పత్తులను సైతం నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రింటర్ల అసోషియేషన్లు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నాయి.

ప్రింటింగ్‌కు మిషనరీని సిద్ధం చేస్తున్న ఫ్లెక్సీ యూనిట్‌ నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు

సంతోషం వ్యక్తం చేస్తున్న ఓనర్లు

(విజయనగరం- ఆంధ్రజ్యోతి)

ఫ్లెక్సీలు ప్రింటింగ్‌ వేస్తున్న నిర్వాహకులకు హైకోర్టు తీర్పుతో ఊరట కలిగింది. ప్లాస్టిక్‌ నిషేధం పేరుతో ఫ్లెక్సీల మెటీరియల్‌గా వాడుతున్న ఉత్పత్తులను సైతం నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రింటర్ల అసోషియేషన్లు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నాయి. నాలుగు రోజులుగా ఫ్లెక్సీల ప్రింటింగ్‌ను బంద్‌ చేశారు. మరోవైపు వాటి యజమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో కేసు వేశారు. దీనిపై స్పందించిన కోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్‌ యూజ్‌ ఫెక్సీలకు మాత్రమే నిషేధం వర్తిస్తుందని కోర్టు స్పష్టంచేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఓవెన్‌, పీవీసీ ఫ్లెక్సీలకు ఈ నిషేధం వర్తించదు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హై కోర్టు వచ్చేనెల 22వ తేదీకి కేసు వాయిదా వేసింది. ఈ తీర్పుపై ఫ్లెక్సీల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీ పెట్టుబడి పెట్టి ప్రింటింగ్‌ యూనిట్లు నిర్వహిస్తున్నామని, పోటీ మార్కెట్లో తక్కువ మార్జిన్‌తో వ్యాపారాలు చేస్తున్నామని, ఉన్నఫలంగా నిషేధం విధిస్తే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బంద్‌ పాటిస్తున్న వీరు గురువారం నుంచి విరమించాలని నిర్ణయించారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 68 ఫ్లెక్సీ యూనిట్లున్నాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, రామభద్రపురం, గజపతినగరం, విజయనగరం, ఎస్‌.కోట, ఎల్‌.కోట, కొత్తవలస, నెల్లిమర్ల, పూసపాటిరేగ, చీపురుపల్లి, గరివిడిలో వీటిని నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-01-26T00:35:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising