ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి రైతూ సీసీ ఆర్‌సీ కార్డు తీసుకోవాలి

ABN, First Publish Date - 2023-06-08T00:13:00+05:30

వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతులందరూ గ్రామరెవెన్యూ అధికారి ద్వారా క్రాప్‌ కల్టివేటెడ్‌ రైట్‌ కార్డు(సీసీ ఆర్‌సీ కార్డు) తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి మాధురి శరణ్య రైతులకు సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తవలస, జూన్‌ 7: వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతులందరూ గ్రామరెవెన్యూ అధికారి ద్వారా క్రాప్‌ కల్టివేటెడ్‌ రైట్‌ కార్డు(సీసీ ఆర్‌సీ కార్డు) తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి మాధురి శరణ్య రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ అందిస్తున్న వివిధ పథకాలపై రైతులకు గ్రామాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా తుమ్మికాపల్లి గ్రామంలో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌలు రైతులకు వ్యవసాయశాఖ నుంచి అందిస్తున్న విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా, బ్యాంక్‌ల నుంచి రుణాలు, పంట నష్ట పరిహారం వంటివన్నీ పొందాలంటే సీసీ ఆర్‌సీ కార్డు తప్పనసరిగా ఉండాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు, వరి విత్తనాలు రైతు ఆధార్‌ కార్డు చూపించి రైతుబరోసా కేంద్రాల్లో ముందుగా రిజస్ర్టేషన్‌ చేసుకుని తీసుకోవచ్చునన్నారు. మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ విరోతి కొండలరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది స్వప్న, పశువైద్య సహాయకురాలు గీత సంతోషి, సీఆర్‌పీ గోవింద, ఐసీఆర్‌పీలు వెంకటలక్ష్మి, లక్ష్మి, రామలక్ష్మి, గౌరి, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-08T00:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising