పాత నిమ్మలపాడులో ఏనుగులు
ABN, First Publish Date - 2023-04-03T00:30:56+05:30
పాత నిమ్మల పాడు ముంపు ప్రాంతంలో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి.
కొమరాడ: పాత నిమ్మల పాడు ముంపు ప్రాంతంలో ఆదివారం గజరాజులు హల్‌చల్ చేశాయి. దీంతో సమీప ప్రాంత వాసులు హడలెత్తిపోయారు. ప్రధానంగా పంటలకు ఎక్కడ నష్టం వాటిల్లుతుందోనని రైతన్నలు భయాందోళన చెందారు. వాస్తవంగా గత కొద్ది రోజులుగా నాగావళికి ఆవల వైపు దుగ్గి, కళ్లికోట, గుణానుపురం, తదితర ప్రాంతాల్లో సంచరించిన గజరాజు లు ప్రస్తుతం నాగావళి నది తూర్పు వైపునకు వచ్చాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి వాటిని తరలించాలని ఆయా ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. కాగా బిత్తరపాడు, దళాయిపేట ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లరాదని, రాత్రి వేళల్లో బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
Updated Date - 2023-04-03T00:30:56+05:30 IST