ఏనుగుల బీభత్సం
ABN, First Publish Date - 2023-09-29T00:28:46+05:30
మండలంలోని పెదమేరంగి పంచాయతీ రామినాయుడువలస గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత మూడు రోజులుగా గ్రామ పరిసరాల్లో తిష్ఠ వేసిన గజరాజులు గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో సత్య కైలాస్ హైస్కూల్‌పై దాడి చేశాయి.
జియ్యమ్మవలస, సెప్టెంబరు 28: మండలంలోని పెదమేరంగి పంచాయతీ రామినాయుడువలస గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గత మూడు రోజులుగా గ్రామ పరిసరాల్లో తిష్ఠ వేసిన గజరాజులు గురువారం వేకువజామున రెండు గంటల సమయంలో సత్య కైలాస్ హైస్కూల్‌పై దాడి చేశాయి. పాఠశాలలోని ఫర్నీచర్, కిటికీలు, తలుపులను ధ్వంసం చేశాయి. పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని నేలకూల్చాయి. దీంతో పాఠశాల కరస్పాండెంట్ రౌతు అజయ్‌కుమార్, ప్రధానోపాధ్యాయుడు పాలతేరు రాజశేఖరరావు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పంటలను కూడా నాశనం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రులు ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని గ్రామస్థులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఏనుగులను త్వరగా తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-09-29T00:28:46+05:30 IST