విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
ABN, First Publish Date - 2023-03-05T00:01:02+05:30
గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ స్పష్టంచేశా రు.
సీతంపేట: గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని పాలకొండ సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ స్పష్టంచేశా రు. శనివారం మం డలంలోని పూతిక వలస గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నతపాఠశశలలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ కనబరచాలని హాస్టల్ సిబ్బందికి కోరారు. ప్రతినెలా ఆరోగ్యతనిఖీలు నిర్వహించి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యం అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఉపవిద్యాశాఖాధికారి విజయపార్వతి, తహసీల్దార్ నరసింహమూర్తి, వైద్యాధికారి షన్ముఖ,మర్రిపాడు పీహెచ్‌సీ వైదా ధికారి సత్యవేణి, హెచ్‌ఎం శారద పాల్గొన్నారు.
Updated Date - 2023-03-05T00:01:02+05:30 IST