ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘క్వారీల నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దు’

ABN, First Publish Date - 2023-03-18T23:52:52+05:30

క్వారీలకు అనుమతులు ఇవ్వొద్దని అప్పన్నదొరపాలెం, పెదరావుపల్లి గ్రామస్థులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయా గ్రామాల్లో డీఆర్వో గణపతిరావు, కాలుష్యనియంత్రణ ప్రతినిధి సుదర్శనరావు, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కొత్తవలస: క్వారీలకు అనుమతులు ఇవ్వొద్దని అప్పన్నదొరపాలెం, పెదరావుపల్లి గ్రామస్థులు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయా గ్రామాల్లో డీఆర్వో గణపతిరావు, కాలుష్యనియంత్రణ ప్రతినిధి సుదర్శనరావు, సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తొలుత అప్పన్నదొరపాలెం గ్రామంలోని రెల్లి రెవెన్యూకు చెందిన సర్వే నెంబరు 1-8లో ఏడు ఎకరాల విస్తీర్ణంలో 20 ఏళ్లకు గాను రాకి మినరల్స్‌ గ్రావెల్‌ క్వారీకి అనుమతులపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకు న్నారు. ఇప్పటికే ఉన్న క్వారీలతో తమ ఆరోగ్యంతోపాటు జీడి తోటలు పాడైపోయి జీవనోపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పెదరావుపల్లి గ్రామ పరిధి లోని 12 హెక్టార్లకు రోడ్డు మెటల్‌ బిల్డింగ్‌స్టోన్‌, గ్రావెల్‌ మైనింగ్‌ కోసం ప్రజాభి ప్రాయం చేపట్టగా ప్రజల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే వివిధ ప్రాంతాల నుంచి స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ హితులుగా చెప్పుకుం టున్న వారికి క్వారీల నిర్వాహకులు కొంత మొత్తంలో ముట్టజెప్పి ఆమోదం తెలిపినట్టు రాయించుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

Updated Date - 2023-03-18T23:52:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising