ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాదయాత్రా చేయనివ్వరా?

ABN, First Publish Date - 2023-09-23T00:10:33+05:30

చంద్రబాబునాయుడు క్షేమాన్ని కోరుతూ సింహాచలం సింహాద్రి అప్పన్న దేవస్థానానికి పాదయా త్రగా బయలుదేరిన టీడీపీ నియోకవర్గ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన)ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

పోలీసు అధికారులతో వాదిస్తున్న బేబీనాయన

- అరెస్టు చేసి స్టేషన్‌కు తరలింపు

- ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలి వద్ద శ్రేణుల ఆందోళన

- నిరసనగా దుకాణాల మూసివేత

బొబ్బిలి, సెప్టెంబరు 22: చంద్రబాబునాయుడు క్షేమాన్ని కోరుతూ సింహాచలం సింహాద్రి అప్పన్న దేవస్థానానికి పాదయా త్రగా బయలుదేరిన టీడీపీ నియోకవర్గ ఇన్‌చార్జి ఆర్‌వీఎస్‌కేకే రంగారావు (బేబీనాయన)ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బేబినాయనను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తుండగా శ్రేణులు అడ్డుపడ్డారు. పట్టణమంతా పోలీసు బలగాలు చేరుకొని ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో పూజలు చేసి అనంతరం పాదయాత్ర నిర్వహించాలని బేబీనాయన సంకల్పించారు. దీనికోసం ఆయన సన్నద్ధమవుతుండగా అప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో బొబ్బిలి కోటకు చేరుకొని చుట్టూ మోహరించారు. కోట నుంచి బేబీనాయనను బయటకు రానివ్వకుండా డీఎస్పీ పి.శ్రీధర్‌, సీఐలు మలిరెడ్డి నాగేశ్వరరావు, తిరుమలరావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసు అధికారులతో గట్టిగా వాదించారు. సింహాద్రి అప్పన్న మొక్కు తీర్చుకోనివ్వరా? అని ప్రశ్నించారు. దీనికి కూడా 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 అంటే ఎలా? అని అన్నారు. తానేమీ మందీ మార్బలంతో పాదయాత్ర చేయడం లేదని, అనుమతి ఇస్తే కార్యకర్తలు వెంట వస్తారని, ఇవ్వకుంటే తానొక్కడినే నడిచి వెళ్తానని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర చేసి తీరుతానన్నారు. ఇందుకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కోట నుంచి బయటకు వచ్చేందుకు బేబీనాయన ప్రయత్నించగా పోలీసులు బలవంతంగా ఆయన్ను అరెస్టు చేసి జీపులో ఎక్కించి మెరకముడిదాం మండలం బుదరాయవలస పోలీసు స్టేషన్‌కు తరలించారు. మార్గమధ్యలో తెర్లాం ప్రాంతానికి చెందిన కార్యకర్తలు బేబీనాయనను తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తమ వాహనం రూటు మార్చారు. పట్టణమంతా పోలీసు బలగాలు చేరుకొని ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కిశరత్‌బాబు, జిల్లా వాణిజ్యవిభాగం అధ్యక్షుడు సుంకరి సాయిరమేష్‌తో పాటు 52 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించారు. బేబీనాయనను అరెస్టు చేశారనే సమాచారం తెలియగానే పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పట్టణానికి చేరుకున్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో ఆందోళన చేపట్టారు. చంద్రబాబు, బేబీనాయనలకు మద్దతుగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసు బలగాలు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. బేబీనాయనతో ఇతర ముఖ్య నాయకులందరినీ పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పట్టణంలో పలు ప్రాంతాల్లో వ్యాపారులు తమ షాపులను మూసివేసి సంఘీభావం తెలిపారు. ఒకానొక దశలో ఏమి జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. ఈ సమయంలో బుదరాయవలస పోలీసు స్టేషన్‌లో ఉన్న బేబీనాయన వాట్సాప్‌లో వీడియో సందేశమిచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్దేశించిన దాని ప్రకారం ఏ ఒక్కరూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని, ప్రశాంతంగా , క్రమశిక్షణగా ఉండాలని హితవు పలికారు. బేబీనాయనకు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, కిమిడి రామల్లిక్‌నాయుడు, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, జనసేన నాయకులు, మాజీ మంత్రి పడాల అరుణ, యశస్విని, గిరడ అప్పలస్వామి, పాలురు బాబు, లంక రమేష్‌, సీపీఎం, సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం బేబీనాయనతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు విడిడిపెట్టారు.

రాష్ట్రంలో రావణ రాజ్యం

మెరకముడిదాం, సెప్టెంబరు 22: రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తోందని బేబీనాయన వ్యాఖ్యానించారు. శుక్రవారం బుదరాయవలస పోలీసు స్టేషన్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు బెయిల్‌ రావాలని సింహాద్రి అప్పన్నస్వామి ఆలయానికి పాదయాత్రగా బయలుదేరిన తనను పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. పాదయాత్రను పోలీసులు భగ్నం చేసినప్పటికీ న్యాయస్థానం ద్వారా అనుమతి తెచ్చుకొని సింహాచలానికి పాదయాత్ర చేయడం ఖాయమన్నారు. తనకు సంఘీభావం తెలిపేందుకు బొబ్బిలి నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు బుదరాయవలస వచ్చారని, అందరికీ ధన్యవాదాలని తెలిపారు. చంద్రబాబుకు న్యాయం లభించేవరకూ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-23T00:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising