ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమష్టి కృషితోనే జిల్లాకు అవార్డులు

ABN, First Publish Date - 2023-06-03T00:34:48+05:30

అధికారుల సమష్టి కృషితోనే జిల్లా అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి అవార్డులను సొంతం చేసుకుంటుందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో జిల్లా వివిధ అవార్డులు సాధించడంతో గురువారం రాత్రి పట్టణంలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో కలెక్టర్‌ను జిల్లా అధికారుల సంఘం సన్మానించింది.

కలెక్టర్‌ను సన్మానిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం, జూన్‌ 2: అధికారుల సమష్టి కృషితోనే జిల్లా అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి అవార్డులను సొంతం చేసుకుంటుందని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. జాతీయ స్థాయిలో జిల్లా వివిధ అవార్డులు సాధించడంతో గురువారం రాత్రి పట్టణంలోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో కలెక్టర్‌ను జిల్లా అధికారుల సంఘం సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతానగరం మండలం జోగింపేట పంచాయతీకి జాతీయ స్వచ్ఛ పురస్కారం, జాతీయ స్థాయిలో నీతి అయోగ్‌ ప్రకటించిన ఆశావహు జిల్లాల్లో పార్వతీపురం ఉత్తమ అవార్డు దక్కించుకుందని తెలిపారు. కనీస వసతులతో నూతన జిల్లా ప్రస్థానం మొదలైందని, అధికారులు కష్టపడి పనిచేయడంతో సంవత్సర కాలంలో జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులను సాధించామని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రంగానికి అభినందనలు తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు మాట్లాడుతూ.. కలెక్టర్‌తో పనిచేసిన అనుభవం తనకు ఉందని, ఏదైనా పనిని పూర్తి చేయడానికి ఆయన రూపొందించే ప్రణాళికలే కీలకమన్నారు. ఎస్పీ వి.క్రాంత్‌పాటిల్‌ మాట్లాడుతూ.. కలెక్టర్‌ జిల్లాలో మంచి టీమ్‌ను ఏర్పాటు చేశారని కొనియాడారు. కొత్తగా ఏర్పడిన మారుమూల జిల్లాలో ఇటువంటి బృందంతో కలిసి ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, అదనపు ఎస్పీ దిలీప్‌కుమార్‌, డీఎఫ్‌వో ప్రసన్న, ఇత ర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising