ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కదంతొక్కిన విద్యార్థులు

ABN, First Publish Date - 2023-06-26T23:59:12+05:30

అరుపులు.. కేకలు.. నినాదాలతో విద్యార్థులు కలెక్టరేట్‌ను అట్టుడికించారు. విద్యా, వసతి దీవెనల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చలో కలెక్టరేట్‌ పేరుతో ఎస్‌ఎఫ్‌ఐ ఇచ్చిన పిలుపునకు జిల్లా కేంద్రానికి కదిలివచ్చిన విద్యార్థులు సోమవారం ఉదయం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

ధర్నా చేస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యా, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని నినాదాలు

కలెక్టరేట్‌, జూన్‌ 26: అరుపులు.. కేకలు.. నినాదాలతో విద్యార్థులు కలెక్టరేట్‌ను అట్టుడికించారు. విద్యా, వసతి దీవెనల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చలో కలెక్టరేట్‌ పేరుతో ఎస్‌ఎఫ్‌ఐ ఇచ్చిన పిలుపునకు జిల్లా కేంద్రానికి కదిలివచ్చిన విద్యార్థులు సోమవారం ఉదయం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం తమ సమస్యలపై నినదించారు. ఇంటర్‌ విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసి, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని, జూనియర్‌ కాలేజీల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. ఆందోళనతో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు రవికుమార్‌, సౌమ్య, వెంకి, రమేష్‌, అర్జున, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

=====

Updated Date - 2023-06-26T23:59:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising