మున్సిపల్ కార్మికుల ధర్నా
ABN, First Publish Date - 2023-09-23T00:22:52+05:30
సాలూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు.
సాలూరు రూరల్: సాలూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కారుణ్య నియామకాలు వర్తింపచేయాలని కోరారు. సబ్బులు, నూనెలు ఇవ్వాలన్నారు. ఇంజినీరింగ్ కార్మికు లకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని, ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శంకరరావు, ఇందు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-23T00:22:52+05:30 IST