ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రోన్‌ పైలెట్ల శిక్షణకు డీజీసీఏ అనుమతి

ABN, First Publish Date - 2023-03-26T00:16:07+05:30

సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో డ్రోన్‌ పైలెట్లకు రిమోట్‌ పైలెట్‌ ట్రైనింగ్‌ ఆపరేషన్‌ (ఆర్‌పీటీవో)లో శిక్షణ ఇచ్చేందుకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి అనుమతులు మంజూరు అయినట్లు యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ జీఎస్‌ఎన్‌ రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నెల్లిమర్ల: సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో డ్రోన్‌ పైలెట్లకు రిమోట్‌ పైలెట్‌ ట్రైనింగ్‌ ఆపరేషన్‌ (ఆర్‌పీటీవో)లో శిక్షణ ఇచ్చేందుకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి అనుమతులు మంజూరు అయినట్లు యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ జీఎస్‌ఎన్‌ రాజు తెలిపారు. తన చాంబర్‌లో ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడారు. డ్రోన్ల తయారీతో పాటు పైలెట్లకు శిక్షణ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపారు. సెంచూరియన్‌ యూనివర్శిటీ విజయనగరం, పర్లాఖిమిడి క్యాంపస్‌లలో వెయ్యి మంది పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మరో పక్క వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కృషక్‌ డ్రోన్‌ తయారు చేసేందుకు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు 16లీటర్ల సామర్థ్యంగల కృషక్‌ డ్రోన్లను తయారుచేయడం వల్ల రైతులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వివరించారు. డ్రోన్ల మరమ్మతుల కోసం హంగర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

Updated Date - 2023-03-26T00:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising