ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగన్‌వాడీల నిర్బంధం సరికాదు

ABN, First Publish Date - 2023-09-26T00:00:57+05:30

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో మహా ధర్నాకు వెళ్లకుండా కార్యకర్తలపై ప్రభుత్వం నిర్బంధించడం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు విమర్శించారు.

పాలకొండ: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో మహా ధర్నాకు వెళ్లకుండా కార్యకర్తలపై ప్రభుత్వం నిర్బంధించడం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు విమర్శించారు. సోమవారం పాలకొండలో అంగన్‌వాడీ కార్యకర్తల అక్రమ నిర్బంధంపై అంగన్‌వాడీ వర్కర్స్‌, అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణా రావుతో పాటు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమ ప్రభ, కోశాధికారి అమరవేణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. శాంతియుతంగా విజయవాడలో మహా ధర్నాకు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలను గృహ నిర్బంధాలు రైల్వేస్టేషన్‌లో అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ పాలకొండ మండల సమన్వయ కమిటీ కార్యదర్శి కాద రాము, మండల కమిటీ సభ్యులు ఎం.వీరనాయుడు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూని యన్‌ ప్రతినిధులు భవాని, జెస్సీబాయి, ఇర్మల, మణి, ధనలక్ష్మి, నాగమణి, ఇందిర, సీతమ్మ, శ్యామల శ్రీదేవి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-26T00:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising