1988లో వచ్చారు..
ABN, First Publish Date - 2023-05-23T00:10:29+05:30
ప్రముఖ సినీనటుడు శరత్‌బాబు(71) మరణాన్ని జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన లేరనే విషయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
నాటి జ్ఞాపకాల్లో పట్టణవాసులు
సాలూరు రూరల్, మే 22: ప్రముఖ సినీనటుడు శరత్‌బాబు(71) మరణాన్ని జిల్లావాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక ఆయన లేరనే విషయాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. కాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన శరత్‌బాబుకు సాలూరుతో అనుబంధం ఉంది. పట్టణంలో ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడు గంటా వెంకటరాజు 1988లో అయ్యప్ప మాలధారణ చేసి, తన ఇంటి వద్ద అంబలం పూజ నిర్వహించారు. ఈ పూజకు సినీగాయకుడు ఆనంద్, సినీనటుడు శరత్‌బాబులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా శరత్‌బాబు 1988, డిసెంబర్‌లో సాలూరు వచ్చి అయ్యప్పస్వామి అంబలం పూజలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన కూడా అయ్యప్పస్వామిపై ఒక గీతం పాడినట్టు గంటా వెంకటరాజు సోమవారం చెప్పారు. శరత్‌బాబుతో నాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి సాలూరు సాహితీమిత్రబృందం, కబీర్‌షా ఆర్కెస్ట్రా, కళాస్రవంతి ప్రతినిధులు తిరుమలాచార్యులు, చందు మాస్టార్, రాంప్రసాద్, భాషా, గణపతి, కృష్ణకుమారి, శ్రీనివాసరావు,జోగినాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-05-23T00:10:29+05:30 IST