ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిబంధనలను ‘తుక్కు’తూ..

ABN, First Publish Date - 2023-07-27T00:20:08+05:30

రాజాం పట్టణంలోని ఓ స్ర్కాప్‌ దుకాణం వద్ద కనిపించిన ఆక్సిజన్‌ సిలిండర్లు ఇవి. కొవిడ్‌ విపత్కాలంలో ఇవే ప్రాణరక్షణగా నిలిచాయి. కొవిడ్‌ రెండో విడత ఆక్సిజన్‌ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లు అందించాయి. వివిధ కారణాలతో అవి మూలకు చేరాయి. ఆ తర్వాత దొంగలపాలై ఇలా స్ర్కాప్‌ దుకాణాలకు చేరాయి.

రాజాంలోని స్ర్కాప్‌ దుకాణం

నిబంధనలను ‘తుక్కు’తూ..

జిల్లాలో అడ్డగోలుగా స్ర్కాప్‌ వ్యాపారం

ఇష్టారాజ్యంగా దుకాణాల ఏర్పాటు

అనుమతులు ఉన్నవి కొన్నే

ప్రమాదాలకు ఆస్కారం

- రాజాం పట్టణంలోని ఓ స్ర్కాప్‌ దుకాణం వద్ద కనిపించిన ఆక్సిజన్‌ సిలిండర్లు ఇవి. కొవిడ్‌ విపత్కాలంలో ఇవే ప్రాణరక్షణగా నిలిచాయి. కొవిడ్‌ రెండో విడత ఆక్సిజన్‌ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లు అందించాయి. వివిధ కారణాలతో అవి మూలకు చేరాయి. ఆ తర్వాత దొంగలపాలై ఇలా స్ర్కాప్‌ దుకాణాలకు చేరాయి.

- రాజాం ప్రధాన రహదారి చెంతనే ఉన్న స్ర్కాప్‌ దుకాణం ఇది. నిబంధనల ప్రకారం రోడ్డు పక్కన ఈ దుకాణం ఏర్పాటుచేయకూడదు. కానీ ఏళ్ల తరబడి ఇక్కడే దుకాణం నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు చూస్తున్నా ప్రశ్నించడం లేదు. అసౌకర్యానికి గురవుతున్నామని సమీప నివాసితులు చెబుతున్నారు.

(రాజాం)

జిల్లాలో స్ర్కాప్‌ దుకాణాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. లక్షలు కురుపించే వ్యాపారం కావడంతో చాలా మంది దృష్టి ఈ వ్యాపారంపైకి మళ్లింది. అయితే అనుమతి లేకుండా.. నిబంధనలు పట్టకుండా వ్యాపారం సాగుతోంది. వీటికి పన్ను కట్టక్కర్లేదు. జీఎస్టీ చెల్లింపులు అక్కర్లేదు. అందుకే ప్రతి చోటా ఏర్పాటవుతున్నాయి. తొలుత జీవనోపాధికి పెట్టుకున్న ఈ షాపులు క్రమేపీ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరిస్తున్నాయి. ఒక్క రాజాం పట్టణంలోనే దాదాపు 15 స్ర్కాప్‌ దుకాణాలు ఉన్నాయి. నిత్యం ఇవి పాత సామాన్లతో కిటకిటలాడుతుంటాయి. జిల్లా వ్యాప్తంగా 200కుపైగా దుకాణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో అనుమతి ఉన్నవి కొన్నే. సాధారణంగా స్థానిక సంస్థల అనుమతితోనే స్ర్కాప్‌ దుకాణాలు ఏర్పాటుచేయాలి. పంచాయతీలు, నగర పంచాయతీలు, మునిసిపాల్టీల పరిధిలో ఏర్పాటుచేస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఇది జరగడం లేదు. స్ర్కాప్‌ కొనుగోలు, విక్రయాలు బిల్లు చెల్లింపుల ద్వారా జరగాలి. కానీ లారీలకు లారీలు లోడ్లతో స్ర్కాప్‌ తరలుతున్నా ఎటువంటి పన్నులు చెల్లించడం లేదన్న ఆరోపణలున్నాయి. తప్పుడు వే బిల్లుతో తరలిస్తున్నట్టు సమాచారం.

- స్ర్కాప్‌ దుకాణాల వల్లే ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. అందుకే ఊరికి దూరంగా నిర్వహించుకోవాలన్న స్పష్టమైన నిబంధన ఉంది. ఇది అమలవుతున్న దాఖలాలు లేవు. విజయనగరం,బొబ్బిలి, చీపురుపల్లి, ఎస్‌.కోట, కొత్తవలసలోనూ ఎక్కడిపడితే అక్కడ ఏర్పాటుచేస్తున్నారు.

- స్ర్కాప్‌మాటున భారీగా శ్రమదోపిడీ జరుగుతోంది. సాధారణంగా స్ర్కాప్‌ ఏరుకునే వారితో వ్యాపార ఒప్పందం చేసుకుంటారు. నిరుపేదలకు డబ్బులు ఆశచూపుతున్నారు. వారి నుంచి వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువకు విక్రయిస్తున్నారు.

- రైల్వే, టెలికాంతో పాటు ప్రభుత్వరంగ సంస్థలు వినియోగించే వస్తువులు కొనడం, అమ్మడం నేరం. కానీ ప్రతిస్ర్కాప్‌ దుకాణంలో అవే సామాన్లు కనిపిస్తున్నాయి. ఆక్సిజన్‌ సిలిండర్లు ప్రతిచోటా ఉంటున్నాయి.

- చాలాచోట్ల బయటకు చిన్నపాటి దుకాణాల్లా ఉంటాయి. లోపల మాత్రం పెద్ద పెద్ద గొడౌన్లు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంటుంది. లక్షలాది రూపాయల స్ర్కాప్‌ను స్టాక్‌ చేస్తున్నారు. ఇటువంటి షాపుల్లో ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది.

- స్ర్కాప్‌ దుకాణాలపై సమీప నివాసితులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరమైన వస్తువులతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. వాటిపై నిఘా లేకపోవడంతో దొంగతనాలకు కూడా కారణమవుతున్నాయి. విద్యుత్‌ శాఖకు సంబంధించి పాత స్తంభాలు, కాలం చెల్లిన ట్రాన్స్‌ఫార్మర్లను దొంగిలించి ఇక్కడే విక్రయిస్తున్నారు. గతంలో చాలా కేసులకు సంబంధించి మూలాలు స్ర్కాప్‌ దుకాణంలో బయటపడడం విశేషం.

స్ర్కాప్‌ దుకాణాలను పరిశీలిస్తాం

స్ర్కాప్‌ దుకాణాలపై దృష్టి పెడతాం. వాటిని పరిశీలిస్తాం. నిబంధనలు అతిక్రమించినట్లయితే కేసులు నమోదు చేసేలా చర్యలు చేపడతాం. రహదారికి ఆనుకొని దుకాణాలు ఉంటే తొలగించేలా చూస్తాం. ప్రజల నుంచి ఫిర్యాదు వస్తే దుకాణాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం.

- డీటీవీ కృష్ణారావు, కమిషనర్‌, రాజాం

Updated Date - 2023-07-27T00:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising