ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తప్పిన పెను ప్రమాదం

ABN, First Publish Date - 2023-03-26T00:31:13+05:30

స్థానిక అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం అర్థరాత్రి శిథిలావస్థలో ఉన్న భవనం శ్లాబు ఒక్కసారిగా కూలింది. సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కూలిన శిథిల భవనం శ్లాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాలకొండ: స్థానిక అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం అర్థరాత్రి శిథిలావస్థలో ఉన్న భవనం శ్లాబు ఒక్కసారిగా కూలింది. సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వాస్తవంగా 15 ఏళ్ల కిందటే అగ్నిమాపక శాఖ కార్యాలయం వినియోగిం చరాదని అధికారులు హెచ్చరించారు. అయితే నిధుల కొరత కారణంగా నూతన భవన నిర్మాణానికి ఆమోదం లభించలేదు. దీంతో చేసేది లేక ఆ భవనంలోనే అగ్నిమాపక సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో అగ్నిమాపక అధికారి కార్యాలయ గది మినహా వాహనం పార్కింగ్‌ చేసే భవనం పూర్తిగా శిథిలమైంది దీంతో ఇటీవల కేంద్రం ముందు చిన్నపాటి రేకుల షెడ్‌ వేసుకొని సిబ్బంది కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఆరుబయటే వాహనాన్ని ఉంచుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శిథిలావస్థలో ఉన్న భవనం శ్లాబు కుప్పకూలింది. రోజూ విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఆ సమయంలో అటువైపు వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగా నూతన భవనానికి కొన్ని నెలల కిందటే ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. నిధులు సమకూర్చకపోవడంతో శిథిల భవనంలోనే సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోంది.

Updated Date - 2023-03-26T00:31:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising