ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ పరిధిలోకి బాలాజీ దేవాలయం

ABN, First Publish Date - 2023-03-16T00:16:01+05:30

అంతకాపల్లి సమీపంలో బాలాజీ టెంపుల్‌ ట్రస్ట్‌ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఈనెల 17 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి రానున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

రాజాం రూరల్‌, మార్చి 15: అంతకాపల్లి సమీపంలో బాలాజీ టెంపుల్‌ ట్రస్ట్‌ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి గోదాసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఈనెల 17 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి రానున్నది. ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంఽథి మల్లిఖార్జునరావు(జి.ఎం.ఆర్‌.), అతని సోదరులచే నిర్మించి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయరు స్వామి వారి సూచనలు, సలహాలతో ప్రస్తుతం ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల 17న 12.15 గంటల నుంచి 12.30 గంటల మధ్య తితిదేకు దేవస్థానాన్ని అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రోజంతా తిరుమల తిరుపతి దేవస్థాన పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం అయిదు గంటలకు సుప్రభాతసేవతో ప్రారంభించి మూలవర్లకు అభిషేకం, మహాసుదర్శన హోమం, కుంభప్రోక్షణ నిర్వహించేందుకు దేవస్థాన పండితులు సన్నాహాలు చేస్తున్నారు. అదేరోజు రాత్రి శ్రీనివాస కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. బాలాజీ టెంపుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ప్రత్యేకంగా హాజరు కానున్నారు.

Updated Date - 2023-03-16T00:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising