రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
ABN, First Publish Date - 2023-09-22T00:10:25+05:30
ఆటోను లారీ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది
రాజాం రూరల్, సెప్టెంబరు 21: ఆటోను లారీ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం అంతకాపల్లి గ్రామానికి చెందిన ఏదూరి కొండలరావు (36) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగే గురు వారం ఉదయం ఆటో నడుపుకుని తిరుగుప్రయాణంలో రాజాం నుంచి స్వగ్రామమైన అంతకాపల్లి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మొగిలివలస జంక్షన్ వద్దకు వచ్చే సరికి ఎదురుగా శ్రీకాకుళం నుంచి రాజాం వైపు వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న కొండలరావు కిందకు తుళ్లి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ రవికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృ తుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Updated Date - 2023-09-22T00:10:25+05:30 IST