ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అరెస్టులు.. నిర్బంధాలు

ABN, First Publish Date - 2023-09-23T00:10:43+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు, జైలును ఖండిస్తూ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన శుక్రవారం తలపెట్టిన పాదయాత్రలో శ్రేణులు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి నిర్భందించారు. ఎక్కడికక్కడే ముం దస్తు అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.

పోలీసుల అదుపులో బొబ్బిలికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులు

- పాదయాత్రలో పాల్గొనకుండా అడ్డంకులు

- కొనసాగుతున్న రిలే దీక్షలు

- ప్రభుత్వానివి వికృత చేష్టలని ఆగ్రహం

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టు, జైలును ఖండిస్తూ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌చార్జి బేబీనాయన శుక్రవారం తలపెట్టిన పాదయాత్రలో శ్రేణులు పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి నిర్భందించారు. ఎక్కడికక్కడే ముం దస్తు అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఎస్‌.కోట నియోజవర్గ ఇన్‌చార్జి కోళ్ల లలితకుమారి, గజపతినగరం నియోజకవర్గ ఇన్‌చార్జి కేఏ నాయుడు, నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కర్రోతుబంగార్రాజు, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి నాగార్జునను అరెస్టు చేశారు. వీరితోపాటు నాయకులు గొంప కృష్ణ, సువ్వాడ రవిశేఖర్‌, వనజాక్షి, కడగల ఆనంద్‌ కుమార్‌, కర్రోతు నరసింగరావు, రాధామణి, ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్‌, బొద్దల నర్సింగరావు, ఆల్తి బంగారుబాబు, గంటా పోలినాయుడు, కంది మురళీనాయుడు, భాషా తదితరులను గృహ నిర్బంధించారు. విజయనగరంలో అశోక్‌ బంగ్లా నుంచి టీడీపీ నాయకులు బయటకు రానీయకుండా పోలీసు పహారా ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వ వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని అన్నారు. మరోపక్క చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. తమ అధినేతను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోరాటాన్ని వీడేది లేదని, తమ నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు.

Updated Date - 2023-09-23T00:10:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising