ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్రంలో అరాచక పాలన

ABN, First Publish Date - 2023-06-26T00:19:16+05:30

రాష్ట్రంలో సీఎం జగన్‌రెడ్డి అరాచకపాలన కొనసాగిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌: రాష్ట్రంలో సీఎం జగన్‌రెడ్డి అరాచకపాలన కొనసాగిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి ఆరోపించారు. సాలూరులోని తన ఇంటి వద్ద ఆదివారం టీడీపీ నేతలతో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం రూ.10లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యాయని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయన్నారు. పోలవరం ప్రాజెక్టు, రైల్వేజోన్‌, మద్యపాన నిషేధం, గిరిజన వర్శిటీ, సీపీఎస్‌ రద్దు, జాబ్‌ క్యాలెండర్‌ లేవన్నారు. విద్యుత్‌ చార్జీలు ఎనిమిది సార్లు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్‌ గ్యారెంటీ మేనిఫెస్టోతో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని బంగాళాఖాతం లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు తిరుపతిరావు, సూర్యనారాయణ, డబ్బి కృష్ణ, భీమారావు, లక్ష్మోజీ, చిరంజీవి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T00:19:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising