అంగడి సరుకుల తరలింపునకు యత్నం
ABN, First Publish Date - 2023-09-21T23:57:50+05:30
మండ లంలోని జర్జంగి పంచా యతీకి చెందిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)వాహనంలో వ్యక్తిగత అంగడి సరుకులు తరలింపునకు నిర్వాహ కుడు గురువారం యత్నించాడు. సంబందిత వాహన నిర్వాహకుడు బొడ్డేపల్లి వెంకట రావు కొత్తపేటలో ఓ సూపర్ మార్కెట్ వద్ద సామగ్రి కొనుగోలుచేసి వాహనం ఎక్కిస్తున్నాడు. అయితే సమాచారం తెలుసుకున్న సీఎస్‌డీటీ కె.రాము హుటాహుటీనా అక్కడకు చేరుకొని వెంకటరావును మందలించి సామగ్రిని వాహనం నుంచి దింపించేశారు.
కోటబొమ్మాళి: మండ లంలోని జర్జంగి పంచా యతీకి చెందిన మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)వాహనంలో వ్యక్తిగత అంగడి సరుకులు తరలింపునకు నిర్వాహ కుడు గురువారం యత్నించాడు. సంబందిత వాహన నిర్వాహకుడు బొడ్డేపల్లి వెంకట రావు కొత్తపేటలో ఓ సూపర్ మార్కెట్ వద్ద సామగ్రి కొనుగోలుచేసి వాహనం ఎక్కిస్తున్నాడు. అయితే సమాచారం తెలుసుకున్న సీఎస్‌డీటీ కె.రాము హుటాహుటీనా అక్కడకు చేరుకొని వెంకటరావును మందలించి సామగ్రిని వాహనం నుంచి దింపించేశారు. ప్రభుత్వవాహనాన్ని వ్యక్తిగతఅవసరాలకు వినియోగించడంపై రాము మందలించాడు. గ్రామంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా అన్నదానంకోసం సామగ్రి కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నట్లు వెంకటరావు తెలియ జేశాడు. అందుకు వేరే ప్రైవేటు వాహ నాన్ని అద్దెకు తీసుకో వాలని, అవసరమైతే నేను అద్దె చెల్లిస్తానని ఎండీఎం వాహనాన్ని వెనుకకు పంపించారు.
Updated Date - 2023-09-21T23:57:50+05:30 IST