విద్యార్థులకు అసౌకర్యం కల్పిస్తే చర్యలు: డీఈవో
ABN, First Publish Date - 2023-07-14T00:20:08+05:30
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అసౌ కర్యం కల్పిస్తే చర్యలు తప్పవని డీఈవో నిమ్మక ప్రేమ్ కుమార్ అన్నారు.
గరుగుబిల్లి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అసౌ కర్యం కల్పిస్తే చర్యలు తప్పవని డీఈవో నిమ్మక ప్రేమ్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథ మిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాకానుక సామగ్రిని నిబంధనల మేరకు విద్యార్థులందరికీ అందించాలన్నారు. సామగ్రిలో లోపాలు ఉన్నట్లయితే సమాచారం అం దిం చాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అమలు చేయాలని తెలిపారు. పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రవేశాలు అధికం గా ఉండేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని ఆదేశిం చారు. బడి బయట ఉన్న వారిని గుర్తించి ఆయా పాఠశా లల్లో చేర్పించాలన్నారు. ఈ మేరకు ఇంటింటి సర్వే చేసి నిర్దేంచిన సమయంలోగా ప్రవేశాలు పూర్తి చేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో ఎంఈవోలు ఎన్.నాగ భూషణ రావు, కె.కొండలరావు, సిబ్బంది వై.శంకరరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-14T00:20:08+05:30 IST