ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అదనపు కట్నం కోసం హింసిస్తే చర్యలు

ABN, First Publish Date - 2023-06-26T23:53:18+05:30

జిల్లాలోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అదనపు కట్నం కోసం హింసించే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ దీపిక ఆదేశించారు. సొమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో స్పందన నిర్వహించి 44 ఫిర్యాదులు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయనగరం క్రైమ్‌: జిల్లాలోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో అదనపు కట్నం కోసం హింసించే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ దీపిక ఆదేశించారు. సొమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో స్పందన నిర్వహించి 44 ఫిర్యాదులు స్వీకరించారు. ఫ పూసపాటిరేగ మండలం తిప్పలవలస గ్రామానికి చెందిన మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ బర్రిపేటకు చెందిన వ్యక్తిని ప్రేమించి 2022 లో వివాహం చేసుకున్నానని, అదనపు కట్నం కోసం భర్త, కుటుంబసభ్యులు శారీర కంగా, మానసికంగా వేధిస్తున్నారని న్యాయం చేయాలని కోరారు. ఫ విజయనగరం మండలం జమ్మునారాయణపురానికి చెందిన వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ విశాఖ పట్టణానికి చెందిన వ్యక్తి తన వద్దనుంచి రూ.20 లక్షలు తీసుకుని ఒక లేఅవుట్‌లోని 11 స్థలాలను తప్పుగా రిజిస్ట్రేషన్‌ చేసి మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరా రు. ఫ గంట్యాడ మండలం జగ్గాపురానికి చెందిన మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేస్తూ తనకూ, భర్తకు మధ్య కుటుంబ తగాదాలున్నాయని దిశాపోలీస్‌ స్టేషన్లో కేసు కూడా నమోదై ఉందన్నారు. తన భర్త తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తన కు మారుడిని తీసుకు వెళ్లిపోయడని, న్యాయం చేయాలని కోరారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన ఎస్పీ తక్షణమే పరిష్కరించి తీసుకున్న చర్యలు నివేదించాలని సంబంధి త పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ డీఎస్పీ విశ్వనాథ్‌, సీఐలు మురళి, రాంబాబు, ఎస్‌ఐ వాసుదేవ్‌, ఇతర పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising