ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జారిపడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2023-06-11T23:50:56+05:30

భోగాపురం గ్రామానికి చెందిన ముద్దన అనీల్‌కుమార్‌(25) దిబ్బలపాలెం సమీపంలో ఉన్న హట్‌(గుడిసె వంటి నిర్మాణం)పై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోగాపురం: భోగాపురం గ్రామానికి చెందిన ముద్దన అనీల్‌కుమార్‌(25) దిబ్బలపాలెం సమీపంలో ఉన్న హట్‌(గుడిసె వంటి నిర్మాణం)పై నుంచి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎస్‌.కృష్ణమూర్తి ఆదివారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. భోగాపురం గ్రామం తోటవీధికి చెందిన ముద్దన అనీల్‌ కుమార్‌ తన స్నేహితుడైన భార్గవ్‌సాయి ఇద్దరు కలిసి శనివారం సాయంత్రం మద్యం తాగేందుకు దిబ్బలపాలెం సమీపానికి వెళ్లారు. అక్కడ హట్‌ పైకి ఎక్కి, మద్యం తాగి, మత్తులో అక్కడే నిద్రపోయారు. సుమారు రాత్రి 10.30 సమయంలో అనీల్‌కుమార్‌ మద్యం మత్తు లో హట్‌పై నుంచి కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని గమనిం చిన స్నేహితుడు భార్గవ్‌సాయి అనీల్‌ కుమార్‌ను లేపడానికి ప్రయత్నించగా ఎంతకీ లేవకపోవడంతో స్నేహితులకు సమాచారం అందించాడు. దీంతో స్నేహితు లు వచ్చి అనీల్‌కుమార్‌ను స్థానిక సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. అనీల్‌కు మార్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని మృతిచెందిన కుమారుడిని చూసి కన్నీటి పర్యాంతమయ్యారు. అలాగే అనీల్‌కుమార్‌ మృతి చెందడంతో స్నేహితులు, బంధువులు తీవ్ర ద్రిగ్బాంతికి గురయ్యారు. అనీల్‌కుమార్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఈయనకు తమ్ముడు ముద్దన భార్గవ్‌, తల్లిదండ్రులు ముద్దన సరస్వతి, చిన్నారావు ఉన్నారు. మృతుడి తండ్రి ముద్దన చిన్నారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-06-11T23:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising