చెట్టుపై నుంచి జారిపడి గిరిజనుడి మృతి
ABN, First Publish Date - 2023-03-02T23:52:29+05:30
చెట్టుపై నుంచి జారిపడి గిరిజనుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పాచిపెంట: చెట్టుపై నుంచి జారిపడి గిరిజనుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. దిగువకన్నయ్య వలసకు చెందిన చెల్లూరి ఆదయ్య(39) గత నెల 25న చింతపండు నిమిత్తం చెట్టు ఎక్కి దులుపుతుండగా అకస్మాత్తుగా జారిపడ్డాడు. గాయపడిన ఆదయ్యను వెంటనే సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందు తున్న ఆదయ్యను మెరుగైన వైద్యం కోసం గతనెల 26న విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 1వ తేదీ సాయంత్రం మృతిచెం దాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
Updated Date - 2023-03-02T23:52:29+05:30 IST