నూతన వేతన ఒప్పందం చేయాలి
ABN, First Publish Date - 2023-09-08T23:55:53+05:30
తమతో చర్చించి, తక్షణమే నూతన వేతన ఒప్పందం చేయాలని కర్లాం వెంకటరామ పౌలీ్ట్ర కార్మికుల సంఘం డిమాండ్ చేసింది.
చీపురుపల్లి: తమతో చర్చించి, తక్షణమే నూతన వేతన ఒప్పందం చేయాలని కర్లాం వెంకటరామ పౌలీ్ట్ర కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఐటీ యూ ఆధ్వర్యంలో పౌలీ్ట్ర కార్మికులు శుక్రవారం చీపురుపల్లిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ ఎం.సురేష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా సీఐటీయూ నాయకులు రమణ, అంబల్ల గౌరినాయుడు మాట్లాడుతూ పాత వేతన ఒప్పందం గత మే 31తో ముగిసిందన్నారు. ఆ తర్వాత నూతన వేతన ఒప్పందం కోసం పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ యాజమాన్యం వైఖరి వల్ల ఫలితమివ్వ లేదన్నారు. నూతన వేతన ఒప్పందంలో భాగంగా తాము మగ కార్మికులకు కనీసం రూ.15 వేలు, మహిళలకు రూ.12వేలు డిమాండ్ చేశామన్నారు. అయినప్పటికీ, యాజమాన్యం వేతన ఒప్పందానికి అంగీకరించడం లేదని చెప్పారు. కార్మిక శాఖ అధికారుల వద్ద జరిగిన చర్చల్లో కూడా యాజమాన్యం మొండిగానే వ్యవహరించిం దని నాయకులు ఆరోపించారు. తక్షణమే వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పౌలీ్ట్ర కార్మికుల సంఘ అధ్యక్షుడు ఐ.గురునాయుడు, ప్రధాన కార్యదర్శి టి.ఈశ్వరరావు, కార్మికులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-08T23:55:53+05:30 IST