ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రూ.10 లక్షల రుణం స్వాహా!

ABN, First Publish Date - 2023-09-23T00:10:29+05:30

అన్నీ తానై వ్యవహరించింది ఆ గ్రామ రిసోర్స్‌ పర్సన్‌(ఆర్పీ). డ్వాక్రా సంఘం సభ్యుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పుస్తకాలన్నీ తన ఆధీనంలోనే ఉంచుకుంది. సభ్యుల ప్రమేయం లేకుండానే వారి ఫొటోలు, పేర్లను వాడుకుని పట్టణంలోని ఓ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకొని సొంతానికి వాడుకుంది.

సిద్ధివినాయక గ్రూపు సభ్యులు, ఆర్పీతో సమావేశమైన సీవో

- లబోదిబోమంటున్న సభ్యులు

రాజాం రూరల్‌, సెప్టెంబరు 22: అన్నీ తానై వ్యవహరించింది ఆ గ్రామ రిసోర్స్‌ పర్సన్‌(ఆర్పీ). డ్వాక్రా సంఘం సభ్యుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పుస్తకాలన్నీ తన ఆధీనంలోనే ఉంచుకుంది. సభ్యుల ప్రమేయం లేకుండానే వారి ఫొటోలు, పేర్లను వాడుకుని పట్టణంలోని ఓ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకొని సొంతానికి వాడుకుంది. ఏడాది తరువాత ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో సభ్యులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజాం మునిసిపాలిటీ పరిధిలోని పొనుగుటివలసకు చెందిన సిద్ధివినాయక సంఘం గతేడాది జనవరిలో రాజాంలోని స్టేట్‌బ్యాంకు నుంచి రూ.3.30 లక్షలు లింకేజిగా రుణం పొందింది. ఈ మొత్తాన్ని గ్రూపులోని పదిమంది సభ్యులు నెలనెలా వాయిదాతో పాటు వడ్డీని చెల్లిస్తూ వస్తున్నారు. అయితే ఇదే సంఘం పేరిట గతేడాది ఆగస్టులో ఈ గ్రూపు వ్యవహారాలు చూస్తున్న రిసోర్స్‌ పర్సన్‌ ఉమ బ్యాంకు నుంచి సభ్యుల ప్రమేయం, సంతకాలు లేకుండా రూ.10లక్షలు రుణంగా తీసుకుంది. ఈ మొత్తాన్ని తన సొంతానికి వాడుకుంది. ఏడాది దాటినా సభ్యులెవరూ ఒక్క వాయిదా కూడా చెల్లించకపోవడంతో బ్యాంకు సిబ్బంది మునిసిపాలిటిలోని మెప్మా అధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు శుక్రవారం మెప్మా సిబ్బంది గ్రామానికి చేరుకుని సంబంధిత గ్రూపు సభ్యులతో సమావేశమయ్యారు. సిబ్బంది చెప్పిన వివరాలు విని సంఘ సభ్యులు లబోదిబోమన్నారు. తాము రుణం తీసుకోలేదన్నారు. ఇదంతా రిసోర్స్‌ పర్సన్‌ ఉమ చేతివాటంగా గుర్తించారు. దీంతో ఆమెను నిలదీశారు. రూ.10 లక్షలు తిరిగి బ్యాంకులో జమ చేస్తానని ఆమె చెప్పినట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్పీ ఉమపై సిద్ధి వినాయక సంఘ సభ్యులు గౌరీశ్వరమ్మ, మౌనిక, మాధురి, పద్మ, రమ్య, లక్ష్మి మెప్మా అధికారిణి రత్నంకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై మెప్మా అధికారిణి రత్నం వివరణ కోరగా.. ‘ఆర్పీ ఉమ రూ.10 లక్షలు రుణం తీసుకున్న విషయం వాస్తవమే. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఆమె చెప్పింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.’ అని తెలిపారు.

మరికొన్ని గ్రూపుల్లో..

పొనుగుటివలస గ్రామంలోని నీలకంఠేశ్వర, సత్యనారాయణ గ్రూపుల్లో సైతం అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. నీలకంఠేశ్వర గ్రూపు లీడర్‌ సుమారు రూ.3.50 లక్షలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. సభ్యులు ప్రతినెలా వాయిదాల మొత్తాన్ని బ్యాంకులో జమ చేయమని ఆమెకు ఇస్తే ఆ మొత్తాన్ని సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. ఇదే పరిస్థితి గ్రామంలోని మరిన్ని గ్రూపుల్లో ఉన్నట్లు తెలిసింది. ఇదే గ్రామంలోని 14 గ్రూపుల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్పీ శారదాంబ రూ.18.21 లక్షలు స్వాహా చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆర్పీలకు కొందరు బ్యాంకు సిబ్బంది సహకరిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. విత్‌డ్రా ఫారంపై సంతకం తేడా వస్తే నగదు ఇచ్చేందుకు అంగీకరించని బ్యాంకు సిబ్బంది.. డ్వాక్రా సభ్యులు బ్యాంకుకు రాకుండా, వారు సంతకాలు చేయకుండా ఆర్పీలకు రూ.లక్షల రుణం ఎలా మంజూరు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కమీషన్లకు కక్కుర్తిపడి స్వాహాపర్వంలో ఒకరిద్దరు సిబ్బంది భాగస్వాములవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2023-09-23T00:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising